వెన్నెల సినిమాతో డెబ్యూలోనే మంచి హిట్ కొట్టి.. ఆ తర్వాత ప్రస్థానం లాంటి గొప్ప సినిమాతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన దర్శకుడు దేవా కట్టా. ఆ సినిమాతో ఒక్కసారిగా తనపై అంచనాలు పెంచేసిన దేవా.. ఆ తర్వాత తీసిన సినిమాలతో అంచనాలను అందుకోలేకపోయాడు.
ఆటోనగర్ సూర్య, డైనమైట్, హిందీ ప్రస్థానం ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ స్థితిలో దేవా ఆశలన్నీ రిపబ్లిక్ మీదే నిలిచాయి. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో దేవా తీసిన సినిమా ఇది. వరుసగా మూడు డిజాస్టర్లు, పైగా చాలా ఏళ్ల విరామం తర్వాత సాయిధరమ్ తేజ్ లాంటి హీరో దొరకడం.. మంచి బడ్జెట్ పెట్టే నిర్మాతలు లభించడం దేవా అదృష్టమే.
తన నుంచి అందరూ ప్రస్థానం లాంటి సినిమాను ఆశిస్తున్న నేపథ్యంలో సమకాలీన రాజకీయాలపై ఒక సీరియస్ సినిమా తీశాడు దేవా. కానీ సినిమాలో పెద్దగా కమర్షియల్ హంగులు లేకపోవడం, స్లో నరేషన్, ట్రాజిక్ క్లైమాక్స్ లాంటి ప్రతికూలంగా మారాయి. సినిమాకు ఆశించినంత మంచి టాక్ రాలేదు. సమీక్షలూ అంతంతమాత్రమే. ఆ ప్రభావం వసూళ్ల మీదా పడింది.
ఐతే రిలీజ్ ముంగిట హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రమోషన్లకు అందుబాటులో లేకుండా పోవడం.. ప్రోమోలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకర్షించకపోవడంతో సినిమాకు అనుకున్నంత బజ్ లేదు. రిలీజ్ తర్వాత టాక్, సమీక్షలు ఆశించిన విధంగా లేవు. ఈ చిత్రాన్ని నిర్మాతలు అంతగా ప్రమోట్ చేయట్లేదు.
రిలీజ్ తర్వాత కూడా తేజు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌కు తెలుగులో అంతగా ఫాలోయింగ్ లేదు. ఆమె రిలీజ్ తర్వాత ప్రమోషన్లు చేయట్లేదు. ఈ స్థితిలో దేవా కట్టా ప్రమోషన్ల పరంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో సినిమా గురించి పెట్టిన పాజిటివ్ కామెంట్లన్నింటినీ సేకరించి.. ట్విట్టర్లో షేర్ చేస్తున్నాడు. పాజిటివ్‌గా మాట్లాడిన వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు. పాజిటివ్ రివ్యూల లింక్స్ సైతం పంచుకుంటున్నాడు. మొత్తానికి తన కెరీర్‌కు చాలా కీలకమైన సినిమాను కాపాడటానికి దేవా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. మరి చివరికి రిపబ్లిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 3, 2021 11:52 am
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…