బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు వివాదాల చుట్టూ తిరుగుతుంటుంది. నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. సుశాంత్ సింగ్ మరణించినప్పుడు కూడా ఆమె పెట్టిన కొన్ని పోస్ట్ లు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు ఈ బ్యూటీ చైతు-సమంత విడాకులపై స్పందించిన తీరు వార్తల్లో నిలిచేలా చేసింది. తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ చైతు-సమంత సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన సంగతి తెలిసిందే.
నాగార్జున కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై కంగనా స్పందించింది. వీరిద్దరి విడాకుల మధ్యలోని ఆమిర్ ఖాన్ ను తీసుకొచ్చింది. చైతు-ఆమిర్ ల పేర్లు నేరుగా చెప్పకుండా.. తాజాగా విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో కొన్ని రోజుల క్రితం ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని.. ఆ వెంటనే తన భార్యకు విడాకులిచ్చాడని కామెంట్ చేసింది కంగనా. సదరు బాలీవుడ్ సూపర్ స్టార్ కు విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని.. ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
పదేళ్లు రిలేషన్ లో ఉండి.. నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. ఈ విడాకుల స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ హీరోని కలిసి వెంటనే సదరు బాలీవుడ్ స్టార్ సలహాల మేరకు తన భార్యకు విడాకులిచ్చాడంటూ రాసుకొచ్చింది కంగనా.
విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. అందులో ఎక్కువ శాతం తప్పు మగాడిదే ఉంటుందని కంగనా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బట్టలు మార్చేంత సులువుగా ఆడవాళ్లను మార్చేసే మగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది.
This post was last modified on October 3, 2021 8:07 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…