‘సర్కారు’- కాసినో సెట్

Mahesh-Babu

సర్కారు వారి పాట అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇక షూటింగ్ మొదలు కావాలి. దానికి ఇంకా చాలా నెలలు టైమ్ వుంది. ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమా కోసం ఓ మాంచి కలర్ ఫుల్ కాసినో సెట్ వేసే ఆలోచనలో యూనిట్ వున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ సినిమాలో విలన్ కూతురు అయిన హీరోయిన్ కు కాసినో పిచ్చి, ఎంత పిచ్చి అంటే పిచ్చి పిచ్చిగా జూదం ఆడుతుంది. అందుకే ఈ సీన్లు అన్నీ తీయాలి అంటే ఓ మాంచి కాసినో కావాలి.

అయితే అమెరికా, లేదా కొలంబో, ఇంకా కాదంటే గోవా వెళ్లాలి. ఇలా చేసే బదులు ఇక్కడే ఓ మాంచి కాసినో సెట్ వేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనలు సాగుతున్నాయి. హీరో హీరోయిన్ల మధ్య కీలకమైన సీన్లు కాసినో లో వుంటాయి. అందుకే కాసినో సెట్ ను వేసే ఆలోచన చేస్తున్నారు.

గోవాలో ఏదైనా మంచి కాసినో వుందా? షూటింగ్ కు కొన్ని రోజులు అనుమతి సాధ్యం అవుతుందా? బడ్జెట్ ఎంత అవుతుంది? అన్న లెక్కలు చూసుకుని, సెట్ వేయడం, వేయకపోవడం అన్నది డిసైడ్ చేస్తారు. కానీ కాసినోలు అన్నీ ఫుల్ బిజీగా బిజినెస్ చేస్తూ వుంటాయి. వాళ్లు షూటింగ్ కు ఇవ్వడం అంటే కాస్త అనుమానం. అందువల్ల రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసే అవకాశమే ఎక్కువ వుంది.