సక్సెస్‌ని ఫాలో అవ్వడమే సక్సెస్ మంత్రం. చిత్రసీమ నమ్మేది అదే. చేతిలో హిట్స్ ఉన్న వాళ్లతోనే పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు హీరోలు. మహేష్‌బాబు అందుకు అతీతుడేమీ కాదు.
ఓరకంగా చెప్పాలంటే.. అందరి కంటే ఎక్కువగా సక్సెస్‌ల చుట్టూ తిరిగేది మహేష్‌నే. విచిత్రం ఏమిటంటే.. మహేష్ సక్సెస్‌ఫుల్ దర్శకుడినే కాదు, సక్సెస్ ఫుల్ టీమ్ మొత్తాన్ని తెచ్చుకుంటాడు. ‘సర్కారు వారి పాట’ టీమ్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది.
‘అల వైకుంఠపురములో’ `టీమ్ లో సగం మంది ‘సర్కారు వారి పాట’లో కనిపిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్, కళా దర్శకుడు ప్రకాష్, కెమెరామెన్ వినోద్.. వీళ్లంత ‘అల వైకుంఠపురములో’ టీమే. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమె కూడా ఖాయమైపోతే, దర్శకుడు – బ్యానర్ తప్ప దాదాపుగా కీలకమైన వాళ్లంతా ‘వైకుంఠపురములో’ నుంచి తెచ్చుకున్న వాళ్లే అవుతారు.
ప్రతినాయకుడిగా ఉపేంద్ర పేరు పరిశీలనలో ఉంది. ఆయన్నీ తెచ్చుకుంటే.. ఇది మొత్తం బన్నీ టీమ్ అవుతుంది. ఎలాగంటారా? ఉపేంద్ర విలన్‌గా ఎంటర్ అయ్యిందే బన్నీ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో కదా?
This post was last modified on June 2, 2020 9:12 am
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…