Movie News

పుష్ప తగ్గాడు.. కానీ తెలివిగా

తగ్గేదే లే.. ‘పుష్ప’ సినిమా మేకింగ్ దశలో ఉండగానే బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. టీజర్లో అల్లు అర్జున్ పలికిన ఈ మాటను మీమ్స్‌లో తెగ వాడేస్తున్నారు. సినిమాలో బన్నీ పాత్ర ఎంత దూకుడుగా ఉంటుందో చెప్పడానికి ఈ డైలాగే సంకేతం. ఐతే ‘తగ్గేదే లే.. తగ్గేదే లే..’ అంటూ వచ్చిన బన్నీ.. తన సినిమా రిలీజ్ విషయంలో మాత్రం తగ్గడం గమనార్హం. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఈ చిత్రం క్రిస్మస్‌కు విడుదల కావట్లేదు. దానికి వారం ముందే రిలీజవుతోంది. డిసెంబరు 17కు రిలీజ్ డేట్ ఇచ్చారు. ‘పుష్ప’ ఈ డేట్‌కు రాబోతోందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఐతే హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’ అనే భారీ చిత్రం డిసెంబరు 25న విడుదల కానున్న నేపథ్యంలో వారం ముందే బన్నీ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని అనుకున్నారు. కానీ ఆ సినిమా రేసు నుంచి తప్పుకున్నప్పటికీ ‘పుష్ప’ను 17కే ఫిక్స్ చేశారు.

ఈ విషయంలో సుకుమార్ అండ్ కో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. 17న సినిమాను రిలీజ్ చేస్తే.. ‘పుష్ప’పై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా ఆ వీకెండ్లో వసూళ్ల మోగ మోగుతుంది. ఇక రెండో వారం క్రిస్మస్ సెలవులు కలిసొస్తాయి కాబట్టి అప్పుడు కూడా సందడి ఉంటుంది. సినిమాకు మంచి టాక్ వస్తే.. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తాయి. ఈ రకంగా సినిమాకు లాంగ్ రన్ ఉంటుందన్న అంచనాతో 17నే ‘పుష్ప’ను రిలజీ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఐతే 17న ‘పుష్ప’ ఫిక్స్ అయిన నేపథ్యంలో క్రిస్మస్ వీకెండ్లో ఏదైనా పేరున్న సినిమాను రేసులో నిలుపుతారేమో చూడాలి. అందుకు అవకాశం లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ‘పుష్ప’ టీం అయితే చాలా తెలివిగానే రిలీజ్ డేట్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే నెలలోనే టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు నెలన్నర సమయం ఉంటుంది.

This post was last modified on October 2, 2021 12:22 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

16 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

49 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago