ఈ మధ్య ఓ సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో పచ్చగా ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారని, కానీ ఐదారుగురు పెద్ద వాళ్లు మంచి స్థాయిలో ఉంటే పరిశ్రమ బాగున్నట్లు కాదని.. సినీ రంగంలో అష్టకష్టాలు పడుతూ జీవనం సాగించేవాళ్లు ఎంతోమంది ఉంటారంటూ నాణేనికి రెండో వైపు గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
ఆయన ప్రధానంగా ప్రస్తావించింది చిన్న స్థాయి సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల గురించే. వాళ్లకు పరిశ్రమలో సరైన గౌరవం ఉండదు. వచ్చే ఆదాయం తక్కువ. అయినా సరే.. సినిమా అనే రంగుల కల వైపు ఆకర్షితులై ఈ ఊబిలో పడి దీన్నుంచి బయటికి రాలేక కష్టపడుతుంటారు. అలాంటి ఓ అమ్మాయి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆ జూనియర్ ఆర్టిస్ట్ పేరు అనురాధ. ఫిలిం నగర్‌లోని జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో అనురాధ ఆత్మహత్యకు పాల్పడింది.
అనురాధ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు కిరణ్ కారణమని పోలీసులు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం సినీ రంగంలో వెలిగిపోదామని వచ్చి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డ అనురాధ.. ఆరేళ్ల కిందట కిరణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడిందట. అతను కూడా పరిశ్రమకు చెందిన వ్కక్తే అని తెలుస్తోంది. వీళ్లిద్దరూ ఒకే గదిలో సహజీవనం చేశారట.
ఐతే అనురాధను తర్వాత చిన్న చూపు చూడటం మొదలుపెట్టిన కిరణ్.. ఇంట్లో వాళ్లు చూసిన వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధ పడ్డాడు. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇది తెలిసిన అనురాధ తీవ్ర మనో వేదనకు గురైంది. చివరికి తాను ఉండే అద్దె ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కిరణ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనురాధ ఆత్మహత్య గురించి తెలిసిన వెంటనే కిరణ్ పరారైనట్లు తెలుస్తోంది.
This post was last modified on October 1, 2021 10:12 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…