Movie News

నాగబాబు నిష్క్రమించినట్లేనా?

మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు తన అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా ఉన్నారు. చిరంజీవి ఇంకా రంగంలోకి దిగకముందే.. ఆయన క్షేత్ర స్థాయిలో తిరగడం ద్వారా అభిమానులను రాజకీయ ప్రయాణానికి సిద్ధం చేయడం గుర్తుండే ఉంటుంది. ప్రజారాజ్యంలో పదవి తీసుకోకపోయినా.. ఆ పార్టీ కోసం తన వంతుగా చేయాల్సింది చేశారు.

ప్రజారాజ్యం పార్టీకి తెరపడ్డాక అన్నయ్య చిరంజీవితో విభేదించి పవన్ కొత్తగా రాజకీయ ప్రయాణం చేయాలనుకున్నపుడు.. తాను చిరంజీవి పక్షమే అని, అభిమానులు కూడా అటే ఉంటారని నాగబాబు చేసిన ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ జనసేన పార్టీ పెట్టిన కొంత కాలానికి నాగబాబు స్టాండ్ మారిపోయింది. తమ్ముడికి మద్దతుగా రంగంలోకి దిగాడు. ఆ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత కూడా పార్టీతో కొనసాగారు.

ఐతే ఇప్పుడు మళ్లీ నాగబాబు తీరు మారినట్లు కనిపిస్తోంది. ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల గురించి కూడా మాట్లాడట్లేదు. పవన్‌కు మద్దతు ఇవ్వట్లేదని కాదు కానీ.. రాజకీయాలకు మాత్రం నాగబాబు దూరమైపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నాగబాబు అభిమానులతో ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ చేశారు. ఇందులో రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు.. తనకు వాటిపై ఆసక్తి లేదని నాగబాబు చెప్పడం గమనార్హం. అంతే కాదు.. తన సిద్ధాంతాలు, అభిప్రాయాలు వేరైనప్పటికీ తుది శ్వాస విడిచే వరకు తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను విడిచిపెట్టనని అన్నారు. దీన్ని బట్టి జనసేనాని సిద్ధాంతాలతో నాగబాబు విభేదించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు రాజకీయాలపై ఆసక్తి లేనపుడు మీరు ప్రజలకెలా సాయం చేస్తారు అని ఓ అభిమాని అడిగితే.. “రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదా. అరరె నాకీ విషయం తెలియదే” అంటూ వ్యంగ్యంగా స్పందించారు నాగబాబు. ఈ వ్యాఖ్యల్ని బట్టి నాగబాబు రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే అనిపిస్తోంది. మరి ఈ స్టాండ్ ఇలాగే కొనసాగిస్తారా.. మళ్లీ ఎన్నికల సమయానికి జనసేనలోకి పునరాగమనం చేస్తారా అన్నది చూడాలి.

This post was last modified on September 30, 2021 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాజీ మంత్రి కొడుకు నిర్మాణంలో విశ్వక్?

ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు…

3 hours ago

అనూహ్యంగా ఎన్టీఆర్ పేరెత్తిన మోడీ.. బాబుకు ఇదే స‌రైన టైం!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…

4 hours ago

రూ.2000 నోట్లు.. RBI మరో సూచన!

నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

4 hours ago

ఆ పాకిస్థాన్ ఫ్యామిలీకి సుప్రీంకోర్టులో ఊరట

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…

6 hours ago

టూరిస్ట్ ఫ్యామిలీని తెగ మెచ్చుకుంటున్నారు

నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…

6 hours ago

అమ‌రావ‌తిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు,…

7 hours ago