కొందరు దర్శకులు చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చినా సరే.. వాళ్లు పెద్ద స్టార్లను ఎలా డీల్ చేస్తారో అన్న సందేహాలు కలుగుతాయి. అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాకు రెడీ అయినపుడు ఇలాగే సందేహించారు. ఐతే అతను అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబును అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేశాడు. మహేష్ నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ హిట్ డెలివర్ చేశాడు.
ఇప్పుడు మహేష్ మరో మీడియం రేంజ్ దర్శకుడితో సినిమాకు రెడీ అయ్యాడు. అతనే పరశురామ్. వీరి కలయికలో ‘సర్కారు వారి పాట’ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఐతే అనిల్ మీడియం రేంజ్ సినిమాలే చేసినా.. వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. కానీ పరశురామ్ పరిస్థితి అలా కాదు.
పరశురామ్ కెరీర్ సక్సెస్ రేట్ మరీ గొప్పగా ఏమీ లేదు. చివరగా తీసిన ‘గీత గోవిందం’ ఒక్కటే బ్లాక్ బస్టర్. అంతకుముందు శ్రీరస్తు శుభమస్తు, సోలో, యువత లాంటి ఓ మోస్తరు హిట్లే ఇచ్చాడు. అతను పని చేసిన పెద్ద స్టార్ అంటే రవితేజనే. ‘గీత గోవిందం’ కూడా మరీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఏమీ కాదు. కాలం కలిసొచ్చి అంచనాల్ని మించి ఆడేసింది.
మహేష్ కూడా ముందు అతడి కథ నచ్చినా కూడా హోల్డ్‌లో పెట్టాడు. వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయ్యాకే అతడికి అవకాశమిచ్చాడు. ఈ నేపథ్యంలో పరశురామ్‌పై మహేష్ అభిమానులకు సందేహాలు నెలకొన్నాయి. ఐతే మహేష్ సినిమాకు పరశురామ్ పెట్టిన టైటిల్, దీని ప్రి లుక్ చూశాక మాత్రం చాలా వరకు వారి సందేహాలు తొలగిపోయాయి.
ఆసక్తికరమైన టైటిల్ పెట్టి.. ప్రి లుక్‌లో మహేష్ బాబును కొత్తగా చూపించడం.. అతణ్ని తాము కోరుకునేలా మాస్ స్టయిల్లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు సంకేతాలివ్వడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. టైటిల్, ప్రి లుక్ వరకు అయితే పరశురామ్ టెస్ట్ పాసైనట్లే. అతడిపై అభిమానులకు గురి కుదరినట్లే. పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి అతను కసితో పని చేసి బ్లాక్ బస్టర్ డెలివర్ చేస్తాడనే ఆశతో ఉన్నారు.
This post was last modified on June 1, 2020 11:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…