Movie News

తమన్.. ఆ ఆశ కూడా తీరిపాయె

ఇప్పుడు త‌మ‌న్ ఉన్న ఊపులో ఇండియాలో మ‌రే మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా లేడు అంటే అతిశ‌యోక్తి కాదు. సినిమా సంఖ్య ప‌రంగా చూసినా, వాటి స్థాయి ప‌రంగా చూసినా ఎవ‌రూ అత‌డికి ద‌రిదాపుల్లో లేరు. ఏక కాలంలో మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ లాంటి బ‌డా స్టార్ల సినిమాల‌కు సంగీతం అందించ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు.

ప్ర‌తి సంగీత ద‌ర్శ‌కుడికీ ఫ‌లానా స్టార్ సినిమాకు, ఫ‌లానా అగ్ర ద‌ర్శ‌కుడి చిత్రానికి సంగీతం అందించాల‌ని కొన్ని క‌ల‌లు ఉంటాయి. కానీ కొంద‌రే వాటిని నెర‌వేర్చుకుంటాడు. త‌మ‌న్ అలా గ‌త కొన్నేళ్ల‌లో చాలా క‌ల‌లే నెర‌వేర్చుకున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ లాంటి ప్ర‌ముఖుల‌తో ప‌ని చేశాడు. తాజాగా సౌత్ ఇండియ‌న్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ కూడా ప‌ట్టేశాడు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ తీయ‌బోయే సినిమాకు త‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు త‌మ‌న్ మ‌రో క‌ల నెర‌వేరే స‌మ‌యం వ‌చ్చినట్లు స‌మాచారం. అత‌ను తొలిసారిగా ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాకు మ్యూజిక్ చేయ‌బోతున్నాడ‌ట‌. త‌మ‌న్ త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేశాడు కానీ.. తెలుగులో మాదిరి అక్క‌డ పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌యే నంబ‌ర్ వ‌న్ హీరో.

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌ను కూడా వెన‌క్కి నెట్టేసి తిరుగులేని రేంజికి చేరుకున్నాడు. విజ‌య్‌తో సినిమా చేయాల‌న్న ఆశ‌ను టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తీర్చేస్తున్నాడ‌ట‌. దిల్ రాజు నిర్మాణంలో విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి సినిమాను తాజాగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి త‌మ‌న్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు చేశార‌ట‌. ఇరు భాష‌ల‌ ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చే సంగీతం ఇవ్వ‌గల‌, మంచి ఫామ్‌లో ఉన్న త‌మ‌నే ఈ సినిమాకు క‌రెక్ట్ అని ఫీల‌య్యి అత‌డికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ బిగ్ ఛాన్స్‌ను త‌మ‌న్ ఎంత బాగా ఉప‌యోగించుకుంటాడో చూడాలి మ‌రి.

This post was last modified on September 28, 2021 8:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago