దివంగత నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళనాట ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. విజయేంద్రప్రసాద్ లాంటి రైట్స్ ఉన్నప్పటికీ.. సరైన ఎలివేషన్స్ లేవని, కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా సాగిందని విమర్శలు వినిపించాయి.
జయలలిత బయోపిక్ మాదిరి లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా విషయంలో విజయేంద్రప్రసాద్ సైతం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. సినిమాలో ఆయన రాసిన చాలా సన్నివేశాలను పక్కన పెట్టేశారట.
విజయేంద్రప్రసాద్ కాకుండా.. దర్శకుడు విజయ్ మరికొంత మంది రైటర్లను పెట్టుకొని డిఫరెంట్ వెర్షన్స్ రాయించుకున్నాడట. దీంతో సినిమా విడుదలైన రోజే దర్శకనిర్మాతలతో విజయేంద్రప్రసాద్ తన అసంతృప్తిని వెళ్లగక్కారని టాక్.
ఈ సినిమా చుట్టూ చాలానే వివాదాలు తిరిగాయి. ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు విజయ్ పై గుర్రుగా ఉన్నారని సమాచారం. అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయలేకపోవడం, ఇప్పుడు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో.. విజయ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునేలా నిర్మాతలు పావులు కదుపుతున్నారు.
This post was last modified on %s = human-readable time difference 7:11 am
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…