పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ సినీ పరిశ్రమను షేక్ చేసి వదిలిపెట్టాక.. మధ్యలో కొన్ని నెలలు మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలో పెద్ద ఎత్తునే సినిమాలు రిలీజయ్యాయి. ఇక కరోనా భయం లేదని.. దాని కథ ముగిసిందని అనుకుని చాలా ఉత్సాహంగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించారు.
మళ్లీ అవకాశం దొరకదేమో అన్నట్లుగా ముందు వెనుక చూసుకోకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో సినిమాలకు రిలీజ్ డేట్లు ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. ఏమిటీ మ్యాడ్‌నెస్ అంటూ ప్రశ్నలు తలెత్తినా ఎవరూ తగ్గలేదు. తమ సినిమా ఏ దశలో ఉంది.. ఎప్పటికి పూర్తవుతుంది.. డెడ్ లైన్ అందుకోగలమా లేదా.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉండబోతోంది.. అన్నది చూసుకోకుండా విడుదల తేదీలు ప్రకటించారు. కానీ తీరా చూస్తే ఏమైంది..? సెకండ్ వేవ్ దెబ్బకు అంతా తలకిందులైంది. అన్ని సినిమాలకూ రిలీజ్ డేట్లు మార్చుకోక తప్పలేదు.
ఇప్పుడు బాలీవుడ్ కూడా అదే తప్పు చేస్తోంది. వచ్చే నెల 22 నుంచి మహారాష్ట్రాలో థియేటర్లు తెరుచుకోవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇలా ప్రకటించాడో లేదో.. ఇలా బాలీవుడ్ వాళ్లకు పూనకాలు వచ్చేశాయి. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 20 సినిమాలకు రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. అసలు మహారాష్ట్రపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో పడిందో అందరికీ తెలుసు. ముందు అనుకున్నట్లుగా ప్రస్తుతానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పెద్దగా కనిపించడం లేదు. అలాగని ప్రభావమే ఉండదని కొట్టిపారేయలేం.
అసలు వచ్చే నెల 22న అనుకున్నట్లుగా థియేటర్లు తెరుచుకుంటాయో లేదో కూడా గ్యారెంటీ లేదు. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అస్సలు ఛాన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఆ టైంకి థియేటర్లు తెరుచుకున్నా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ బాలీవుడ్ వాళ్లు మాత్రం ఇక ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదన్నట్లుగా వచ్చే వేసవికి కూడా బెర్తులు బుక్ చేసేశారు. టాలీవుడ్ తరహాలోనే తొందరపడ్డారు. మరి వీళ్ల ప్రణాళికలు ఏమేర ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on September 27, 2021 6:35 pm
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…