‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఇంకో రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఇటు ప్రకాష్ రాజ్ వర్గం, అటు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా.. మంచు విష్ణు బృందం కూడా ఒకట్రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ మంచు విష్ణు ‘మా’ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఎవరికి ఉందో వాళ్లే విజేత అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. చిరు ఓటు తనకే అని విష్ణు ప్రకటించడం విశేషం. త్వరలోనే తమ బృందం తరఫున నామినేషన్లు వేసి.. ఆ తర్వాత చిరంజీవిని కలుస్తానని… కచ్చితంగా ఆయన తమకు మద్దతు పలుకుతాడని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు.
తమ ప్యానెల్ మ్యానిఫెస్టో చూపించి, తాను ఏం చేయాలనుకుంటున్నానో వివరిస్తే కచ్చితంగా చిరంజీవి ఓటు తనకే పడుతుందని మంచు విష్ణు అన్నాడు. ‘మా’ కోసం ఏం చేయాలనే విషయంపై తన దగ్గర పక్కాగా ప్రణాళికలు ఉన్నాయని విష్ణు చెప్పాడు. ప్రకాష్ రాజ్ కంటే తానే ‘మా’ కోసం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. తాను ‘మా’ అధ్యక్షుణ్ని అయితే అప్పు చేసి అయినా ‘మా’ కోసం సొంత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని అతనన్నాడు.
అంతటితో పరిమితం కాకుండా ‘మా’ సభ్యుల పిల్లల చదువు విషయంలోనూ ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలనుకుంటున్నానని.. ఈ విషయంలో వేరే వాళ్లకు అంత ప్లాన్ ఉందని తాను భావించడం లేదని విష్ణు అన్నాడు. ఐతే విష్ణు ఇంత ధీమాగా చిరు మద్దతు తనకే అంటున్నాడు కానీ.. ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రకాష్ రాజ్ వెనుక చిరు ఉన్నాడని అనుకుంటున్నారు. మరి చిరు బహిరంగంగా ఈ ఇద్దరిలో ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on September 27, 2021 1:46 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…