కెరీర్ స్టార్ట్ చేసి పద్నాలుగేళ్లు దాటినా టాప్ హీరోయిన్‌గానే వెలుగుతోంది కాజల్. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేసింది. ఇండియన్ 2, ఆచార్య, ద ఘోస్ట్ లాంటి భారీ చిత్రాలతో పాటు ఉమ, హే సినామికా లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకూ బెస్ట్ చాయిస్‌గా నిలిచింది. అయితే రీసెంట్‌గా ఆమె ‘ద ఘోస్ట్’ మూవీ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆ స్థానంలో ఇలియానాని తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలియానా ఇప్పుడు ఫామ్‌లో లేదు. టాలీవుడ్‌లో ఆమె ఫాలోయింగ్ పూర్తిగా తగ్గిపోయింది కూడా. అందుకే జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఫైనల్ చేశారని అంటున్నారు.
అసలిప్పుడీ మార్పు ఎందుకంటే.. కాజల్ తల్లి కాబోతోందని తెలియడమే. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాగ్‌తో పాటు కాజల్ కూడా పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. ఆమె స్టంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కావడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కాజల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.
అయితే తాను కన్సీవ్ అయినట్టు కాజల్ ఇంతవరకు క్లూ ఇవ్వలేదు. టీమ్ కూడా పాత హీరోయిన్ తప్పకుందని కానీ, కొత్త హీరోయిన్‌ని తీసుకుంటున్నామని కానీ కన్‌ఫర్మ్ చేయలేదు. దాంతో అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజమే అయితే జాక్వెలిన్ మంచి చాయిస్ అనే చెప్పాలి.
గొప్పగా చెప్పుకునే విజయాలైతే లేవు కానీ జాక్‌కి క్రేజ్ మాత్రం కావలసినంత ఉంది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోస్‌తో యూత్ మతులు పోగొడుతూనే ఉంటుంది. అదే ఆమెకి సౌత్‌లో కూడా అవకాశాలు తెచ్చిపెడుతోంది. సుదీప్‌తో ‘విక్రాంత్ రోనా’లో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లోనూ కనిపించబోతోంది. ఇప్పుడు నాగ్ సరసన కూడా చాన్స్ కొట్టిందంటే ఇక దక్షిణాదిన కూడా చక్రం తిప్పడం ఖాయం.
This post was last modified on September 26, 2021 3:09 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…