‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను షురూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమా గురించి జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఓవర్ నైట్ ఆ సినిమా మీద కొత్త ఆసక్తితో పాటు..ఆ సినిమా కార్యక్రమానికి సంబంధించిన అంశం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
తనను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడిన పవన్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా సొంత అన్న మొదలు ఎవరిని వదిలిపెట్టలేదు పవన్ కల్యాణ్.
ఏపీ మంత్రి పేర్ని నానిని అయితే.. ఏకంగా సన్నాసి మంత్రి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించటమే కాదు.. అదే పనిగా ఆయన నోటి నుంచి ‘సన్నాసి’ పదం రావటం చూస్తే.. పవన్ ఆగ్రహం ఏ స్థాయిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా మారింది. సభలోనే ఉన్న దిల్ రాజును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘దిల్ రాజుగారూ! మీరు నాతో సినిమా తీయకుంటే ఆంధ్రాలో సినిమాలను అడ్డుకునే వారు కాదు. మీరూ రెడ్డి, వారూ రెడ్డే కదా! మీరూ మీరూ తేల్చుకోండి. మమ్మల్ని బతికించండి’ అన్న పవన్.. దిల్ రాజును రెడ్డిగా పిలవాలంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దిల్ రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఆయన కులం పేరు పెద్దగా ఎప్పుడూ చర్చకు రాదు.
ఆ మాటకు వస్తే.. తన సామాజిక వర్గాన్ని తెలిసేలా వ్యవహరించటానికి దిల్ రాజుకు ఇష్టం ఉండదని చెబుతారు. అలాంటి దిల్ రాజు సామాజిక వర్గాన్ని ప్రస్తావించటంతో పాటు.. ‘మీరు రెడ్లు.. వాళ్లు రెడ్లు.. మీరు కాస్త మాట్లాడితే.. సీఎం జగన్ ఏమైనా ఒప్పుకుంటారేమో’ అంటూ సరదాగా చేసిన వ్యాఖ్య అందరిని ఆకర్షిస్తోంది.
This post was last modified on September 26, 2021 11:31 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…