నందమూరి బాలకృష్ణ పేరు ఈ మధ్య ఉన్నట్లుండి వార్తల్లోకి వచ్చింది. షూటింగులు మళ్లీ మొదలుపెట్టుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ తరఫున నిర్వహించిన సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఆయన ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో బాలయ్యను చాలామంది తప్పుబట్టారు.
ఐతే మామూలుగా తన గురించి ఎవరేమనుకున్నా, తన చర్యలపై ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టనట్లు ఉండిపోయే బాలయ్య ఈసారి మాత్రం భిన్నంగా స్పందించాడు. డ్యామేజ్ కంట్రోల్‌కు రెడీ అయ్యాడు. ఇందుకోసం ఒక యూట్యూబ్ ఛానెల్‌ను పిలిచి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం.
ఇందులో తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య నడిచిన సమావేశం గురించి తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. అంతే కాక నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలు, విమర్శల మీదా స్పందించారు. అంతే కాక తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందన్న అభిప్రాయాలు, డిమాండ్ల మీదా బాలయ్య రెస్పాండయ్యారు.
ఇంకా అనేక ఆసక్తికర, వివాదాస్పద విషయాలపై బాలయ్య ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సంబంధిత ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాకు గౌరవం ఇవ్వండి మీరు పుచ్చుకోండి అంటూ మధ్యలో బాలయ్య ఓ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
ఇంతకుముందు మామా ఏక్ పెగ్ లా పాట పాడిన బాలయ్య కొత్తగా ఇంకో పాట అందుకున్నాడట. దాన్ని త్వరలోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడట. ఇంకా బోయపాటితో చేస్తున్న సినిమా విశేషాలు, లాక్ డౌన్ కబుర్లు చాలానే చెప్పాడు బాలయ్య. ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం వస్తే సెన్సేషన్ అయ్యే అవకాశముంది.
This post was last modified on June 1, 2020 10:16 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…