కొన్ని వారాలుగా తెలుగు సినీ ప్రేమికుల చర్చల్లో సినిమాలను మించి ఒక సినిమా జంట వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఆ జంట అక్కినేని నాగచైతన్య, సమంతలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రేమించి పెళ్లి చేసుకుని దాదాపు నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. విడిపోతున్నట్లుగా కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఇద్దరూ కలిసి కనిపించకపోవడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు స్పందించకపోవడం.. సమంత తన ఇంటి పేరులోంచి అక్కినేని తీసేయడం లాంటి పరిణామాలు ఈ అనుమానాలను పెంచుతున్నాయి.
కానీ వాస్తవంగా ఏం జరుగుతోందో స్పష్టత లేదు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేవాళ్లు కరవయ్యారు. చైతూ, సమంత.. అలాగే అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఈ విషయంలో నోరు మెదపట్లేదు.
తిరుమలకు వచ్చిన సమంతను చైతూతో విడాకుల గురించి జరుగుతున్న ప్రచారంపై అడిగితే ఆగ్రహించింది. నాగచైతన్య ఏమో.. లవ్ స్టోరి ప్రమోషన్లలో సమంత గురించి ప్రశ్నలే రాకూడదని ముందే కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయినా సరే.. అతడికి సంబంధిత ప్రశ్నను ఎదుర్కోక తప్పలేదు. దీనికి చైతూ ఇచ్చిన సమాధానం అందరికీ దిమ్మదిరిగేలా చేసింది. సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. తాను సినీ, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూస్తానని.. వ్యక్తిగత జీవితం గురించి స్పందించడం ఇష్టముండదని.. తన గురించి మీడియాలో వచ్చిన వార్తలు బాధ పెట్టాయని వ్యాఖ్యానించాడు.
ఐతే ఈ వ్యాఖ్యల ద్వారా చైతూ ఏం చెప్పదలుచుకున్నాడన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. వ్యక్తిగత విషయాలపై మాట్లాడనంటే.. జనాలకు విషయం బోధపడేది. కానీ తన గురించి వచ్చిన వార్తలు బాధ పెట్టాయి అన్నాడంటే దాని ఉద్దేశమేంటో మరి? సమంత నుంచి విడిపోతుండటం నిజమే కానీ, మీడియాలో దాని గురించి వార్తలు రావడం కరెక్ట్ కాదంటున్నాడా.. లేక మీడియాలో వస్తున్నది అబద్ధం అంటున్నాడా..? ఏం చెప్పదలుచుకున్నాడో సూటిగా చెప్పాలింది లేదా.. దీనిపై మాట్లాడను అనేసి ఊరుకోవాల్సింది. అలా కాకుండా ఇలా కన్ఫ్యూజ్ చేయడమేంటో?
This post was last modified on September 24, 2021 11:29 pm
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…