తెలుగులో ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. తొలి చిత్రం ఆనంద్‌తోనే దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన ఆయన.. ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. ఇప్పుడు లవ్ స్టోరి లాంటి మరో స్పెషల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే ఈ సినిమా ఒక దశ వరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.
ప్రథమార్ధంలో శేఖర్ మార్కు బ్యూటిఫుల్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ అయ్యేసరికి మంచి అనుభూతినే కలిగిస్తుంది లవ్ స్టోరి. కానీ సెకండాఫ్‌లో సినిమా అనుకున్నంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కులం, లైంగిక వేధింపుల చుట్టూ కథను నడపడంతో సినిమా భారంగా తయారైంది. ఇక్కడ కమ్ముల మార్కు మిస్ అయిపోయింది. చాలా వరకు రొటీన్‌గా సాగిపోయి.. రొటీన్‌గా ముగిసిపోయిందీ సినిమా.
కమ్ములతో మొదట్నుంచి ఉన్న సమస్యే ఇది. ఆయన మెజారిటీ సినిమాల్లో ఫస్టాఫ్ మంచి హై ఇచ్చి.. సెకండాఫ్‌కు వచ్చేసరికి గ్రాఫ్ పడిపోవడం గమనించవచ్చు. లీడర్ మూవీ ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి వావ్ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో ఇంటెన్సిటీ మిస్ అయి.. అంచనాలను అందుకోలేక నిరాశ పరుస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా కొంత వరకు ఇంతే.
ఇక శేఖర్ చివరి సినిమా ఫిదా కూడా ఈ కోవకు చెందిందే. ప్రథమార్ధంలో ఓ రేంజిలో ఎంటర్టైన్ చేసే ఈ చిత్రం.. సెకండాఫ్‌లో నెమ్మదిగా, కొంచెం భారంగా సాగి విసిగిస్తుంది. కాకపోతే ఆ సినిమాపై ముందు మరీ అంచనాలేమీ లేకపోవడం.. ఫస్టాఫ్‌తోనే ప్రేక్షకులు వినోదంలో మునిగి తేలడంతో సెకండాఫ్ లోపాలు కవరైపోయి సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. కానీ లవ్ స్టోరి మీద అంచనాలు బాగా ఎక్కువైపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకపోవడం, ముఖ్యంగా సెకండాఫ్‌లో కమ్ముల వీక్‌నెస్ కొనసాగడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
This post was last modified on September 24, 2021 11:14 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…