తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడికి ఆటోమేటిగ్గా అవకాశాలు క్యూ కట్టేస్తాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి సినిమా అవకాశం దక్కించుకుని దాంతో విజయాన్నందుకున్నాక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలు లైన్లో పెట్టి చకచకా లాగించేస్తుంటారు దర్శకులు. కానీ ‘ఉప్పెన’తో భారీ విజయాన్నందుకున్న బుచ్చిబాబు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తొలి సినిమాలో అతడి పనితనాన్ని అందరూ మెచ్చుకున్నారు. తనతో పని చేయడానికి పెద్ద స్టార్లు కూడా ఉత్సాహం చూపించారు. కానీ ఎంతకీ అతడి రెండో సినిమా మాత్రం ఓకే కాకపోవడం.. పట్టాలెక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా హీరోనే బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. వాళ్లిద్దరికీ ముందు నుంచి ఉన్న సాన్నిహిత్యం కూడా కలిసి సినిమా చేయడానికి ఉపయోగపడేదే. కానీ ఎన్టీఆర్‌కు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ల వల్ల రెండు మూడేళ్లు బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు.
దీంతో వేరే స్టార్ల కోసం ట్రై చేస్తున్నాడు కానీ.. ఎంతకీ ఎవ్వరూ పచ్చ జెండా ఊపట్లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లందరూ బిజీగా ఉండటం, వెంటనే బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం లేకపోవడం సమస్యగా మారింది. మళ్లీ తన తొలి చిత్ర హీరో వైష్ణవ్ తేజ్‌తోనే బుచ్చిబాబు తన రెండో సినిమా కూడా చేస్తాడని వార్తలొచ్చాయి కానీ.. అది కూడా జరిగేలా కనిపించడం లేదు. తాజా కబురేంటంటే.. బుచ్చిబాబు సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశాడట. వీరి మధ్య జరిగిన మీటింగ్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఒకవేళ బుచ్చిబాబు.. మహేష్‌కు కథ చెప్పాడా.. సూపర్ స్టార్‌కు అది నచ్చిందా అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మహేష్‌కు కథ నచ్చినా అతను కూడా ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది. తొలి సినిమాతో భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో పెద్ద స్టార్‌తో సినిమా చేసి తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని బుచ్చిబాబు భావిస్తున్నట్లుంది. మరి బుచ్చిబాబుకు వెంటనే డేట్లు ఇచ్చి సినిమా చేసే స్టార్ ఎవరన్నదే ప్రశ్న.
This post was last modified on September 24, 2021 2:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…