సీనియర్ హీరో వెంకటేష్ తన కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేశారు. ఆయన సినిమాల లిస్ట్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఈ ఏడాదిలో ఆయన నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలు కూడా రీమేక్ సినిమాలనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా వెంకటేష్, రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి ‘రానా నాయుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
అయితే ఇప్పుడు ఈ సిరీస్ కూడా రీమేక్ కావడం విశేషం. హాలీవుడ్ లో తెరకెక్కిన క్రైమ్ సిరీస్ ‘రే డోనవన్'(Ray Donovan) అక్కడ సూపర్ సక్సెస్ అయింది. చాలా మంది ఇండియన్స్ కూడా ఈ సిరీస్ చూసేశారు. ఇప్పుడు ఈ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ గా ‘రానా నాయుడు’ని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఇది సక్సెస్ అయిన కథే కాబట్టి తెలుగులో కూడా ఈ క్రైమ్ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు.
ప్రస్తుతం వెంకటేష్.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ టైమ్ కి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మరోపక్క రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే ఆయన నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమా 2022 సంక్రాంతి బరిలో దిగనుంది.
This post was last modified on September 23, 2021 7:07 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…