‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ డిమాండ్ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. తెలుగుతో పాటు కోలీవుడ్ లో అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె నటించిన కొన్ని సినిమా డిజాస్టర్ అయ్యాయి. దీంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ నటిస్తోన్న కీర్తి మరోపక్క సిస్టర్ రోల్స్ లో కనిపించడానికి ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఇంత క్రేజ్ ఉండి, మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎవరూ కూడా అక్క, చెల్లెలు పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. కానీ కీర్తి సురేష్ మాత్రం అలాంటి నియమాలు పెట్టుకోవడం లేదు. ఏకంగా రెండు సినిమాల్లో సిస్టర్ గా కనిపించడానికి అంగీకరించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్న ‘భోళా శంకర్’ సినిమాలో కీర్తి.. హీరో సిస్టర్ రోల్ ప్లే చేయనుంది. మొదట ఆ పాత్ర కోసం సాయిపల్లవిని అనుకున్నారు కానీ ఆమె నో చెప్పడంతో కీర్తి సురేష్ ను సంప్రదించారు.
దీనికోసం కీర్తికి దాదాపు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో పాటు తమిళంలో మరో సినిమా ఒప్పుకుంది కీర్తి సురేష్. సెల్వరాఘవన్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఆయన చెల్లెలుగా నటించమని కీర్తిని అడగ్గా.. దానికి ఆమె అంగీకరించింది. తెలుగు, తమిళం రెండు భాషల్లో స్టార్ హీరోలతో నటించిన కీర్తి ఇప్పుడు సిస్టర్ రోల్స్ లో నటించడం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on September 22, 2021 2:42 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…