కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్ బాక్సాఫీస్ పుంజుకుంటోంది. ఈ వారం విడుదలవుతున్న ‘లవ్ స్టోరి’ థియేటర్లలో పూర్వపు కళ తీసుకొస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది దసరా చిత్రాలే.
పండక్కి ముందు వారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కొండపొలం విడుదలవుతుండగా.. దసరా వీకెండ్లో వచ్చే చిత్రాల మీద పూర్తి స్పష్టత రాలేదింకా. ఒక్క ‘మహాసముద్రం’ సినిమా మాత్రమే పండక్కి ఖరారైంది.
నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ’ దసరాకు వస్తుందని ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు ఆ సంకేతాలేమీ కనిపించడం లేదు. ఈ సిినిమా దసరా రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే. దీని స్థానంలో విక్టరీ వెంకటేష్ చిత్రం ‘దృశ్యం-2’ దసరా రిలీజ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరి దసరాకు మహాసముద్రం, దృశ్యం-2 మధ్య పోటీకి అంతా ఫిక్స్ అయిన టైంలో ఇప్పుడు ఊహించని విధంగా మరో సినిమా రేసులోకి వచ్చింది. అదే.. పెళ్ళిసంద-డి. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ అమ్మాయి శ్రీలీల జంటగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘పెళ్ళిపందడి’ రీహ్యాష్ లాగా కనిపిస్తోందీ సినిమా.
గౌరి రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించడమే కాక దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఆయన ఇందులో ఓ ప్రత్యేక పాత్ర కూడా చేయడం విశేషం. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయించారు. ట్రైలర్ కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది కానీ.. అంతటా పాత వాసనలు కొడుతున్నాయి.
కొత్తగా ఏమీ కనిపించలేదు. ఇందులో రొమాన్స్ అంతా రాఘవేంద్రరావు కాలం నాటిదే. ఈ రోజుల్లో ఈ తరహా సినిమాలు ప్రేక్షకులకు ఎంతమేర రుచిస్తాయన్నది సందేహమే. మరి దసరా బరిలో నిలుస్తున్న ఈ చిత్రం మిగతా సినిమాల పోటీని తట్టుకుని ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on September 22, 2021 1:56 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…