శేఖర్ కమ్ముల కెరీర్లో ప్రత్యేకంగా కనిపించే చిత్రం.. లీడర్. ఎక్కువగా లైట్ హార్టెడ్ లవ్ స్టోరీలు, కాలేజ్, కాలనీ కథలు తీసిన తీసిన కమ్ముల.. ఈ సినిమాలో మాత్రం రాజకీయ వ్యవస్థ, అవినీతి చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాను చూపించాడు. ఇందులోనూ తన క్లాస్ చూపించినప్పటికీ కమ్ముల నుంచి ఇలాంటి సినిమాను ఆ టైంలో ఎవరూ ఊహించలేదు. ఐతే ‘లీడర్’ అప్పట్లో మరీ పెద్ద విజయం సాధించలేదు. అలాగని ఫెయిల్యూర్‌గానూ నిలవలేదు. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. కమ్ముల నుంచి ఇలాంటి సినిమా ఇంకోటి వస్తే బాగుండన్న అభిప్రాయం జనాల్లో ఉంది.
‘లీడర్’ సీక్వెల్ గురించి గతంలో చర్చ జరిగిన నేపథ్యంలో ఆ సినిమానే కమ్ముల నుంచి ఆశిస్తున్నారు కూడా. తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన శేఖర్.. ‘లీడర్-2’ కచ్చితంగా తీస్తానని ప్రకటించడం విశేషం.
‘లీడర్-2’ తీయడానికి తగ్గ ఆలోచనలు తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా కచ్చితంగా తీస్తానని.. కానీ అందుకు టైం పడుతుందని కమ్ముల తెలిపాడు. ‘లీడర్’లో ఉన్న ముఖ్య పాత్రలన్నీ అందులోనూ ఉంటాయని, రానా కూడా నటిస్తాడని.. ఆ పాత్రలతోనే నడిచేలా ‘లీడర్-2’ తీస్తానని చెప్పాడు. ధనుష్‌తో తీయబోయే సినిమా థ్రిల్లర్ జానర్లో ఉంటుందని చెప్పిన కమ్ముల.. తన కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ కచ్చితంగా ఘనవిజయం సాధించడమే కాక, ప్రేక్షకుల్లో ఒక కదలిక తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇందులో రెండు కీలక విషయాలపై చర్చ ఉంటుందని.. అందులో ఒకటి అబ్బాయి పట్ల ఉండే కులవివక్ష కాగా.. ఇంకోటి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలపై సమాజం చూపించే వివక్ష అని అతనన్నాడు. ఐతే ఈ సమస్యలకు తాను పరిష్కారం చూపించేశానని అనుకోవట్లేదని.. కానీ తప్పుల్ని చెప్పడం అవసరమన్న ఉద్దేశంతో వాటిని సినిమాలో బలంగా చూపించినట్లు తెలిపాడు. తన గత చిత్రాల్లానే ‘లవ్ స్టోరి’ కూడా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుందన్నాడు.
This post was last modified on September 20, 2021 6:21 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…