దేశంలోనే అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీల్లో ఒకటైన టాలీవుడ్‌కు పెద్దగా ఉండటం హోదా పరంగా గొప్పగానే ఉంటుంది. కానీ ఆ స్థానంలో ఉండి ఇండస్ట్రీ సమస్యల్ని భుజాన వేసుకుని వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. బయటి నుంచి చూసేవాళ్లకు అన్నీ తేలిగ్గానే కనిపిస్తాయి. అలా చేశారేంటి ఇలా చేశారేంటి అని కామెంట్లు చేయడం ఈజీనే. కానీ ఇండస్ట్రీ పెద్ద స్థానంలో ఉండి చేసే వాళ్లకు తెలుస్తుంది బాధ. దీని ద్వారా ఆర్థికంగా పోయేదే తప్ప వచ్చేది ఉండదు. ఒక మంచి పని చేస్తే వచ్చే ప్రశంసలు బాగానే ఉంటాయి కానీ.. ఒక చిన్న తప్పిదం చోటు చేసుకున్నా వేలెత్తి చూపించే వాళ్లు చాలామందే ఉంటారు.
కాబట్టి ఇండస్ట్రీ పెద్దగా ఉండటం అంటే ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవడమే. అందుకే దర్శకరత్న దాసరి నారాయణ రావు తర్వాత ఆయన స్థానంలోకి రావడానికి చిరు కంటే సీనియర్లు, ‘ఇండస్ట్రీ పెద్దలు’గా పేరున్న చాలామంది ముందుకు రాలేదు.
ఐతే చిరంజీవి కూడా అంత సుముఖంగా లేకపోయినా.. ఇండస్ట్రీలో చాలామంది కోరిన మేరకు, తనకున్న స్టేచర్ వల్ల దాసరి స్థానంలోకి రాక తప్పలేదు. అలా ఇండస్ట్రీ పెద్ద అయ్యాక చిరు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కరోనా టైంలో ఆయన చారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దానికి, ముందు తర్వాత కూడా చిరు ఎంతోమందికి సాయం చేశారు. ఆర్థిక సాయం అనే కాక అనేక రకాలుగా చాలామందికి సాయపడ్డారు. ఇండస్ట్రీ సమస్యల్ని నెత్తిన వేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా ధాటికి కుదేలైన ఇండస్ట్రీని ఆదుకోవడానికి చిరు ఎంత కష్టపడుతున్నారో అందరూ చూస్తున్నారు.
తాజాగా ఏపీలో టికెట్ల ధరలు, ఇతర సమస్యల్ని పరిష్కరించడానికి చిరు పడుతున్న తాపత్రయం అందరికీ కనిపిస్తూనే ఉంది. తన స్థాయికి ఎవరి దగ్గరా తలొంచాల్సిన పని లేదు. అలాంటిది.. ఇండస్ట్రీ మంచి కోసమని ఒక సినిమా వేదిక మీది నుంచి ఒక రకమైన నిస్సహయతతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సమస్యల పరిష్కారం కోసం అర్థించడం.. “వినమ్రంగా వేడుకుంటున్నా” అని చేతులు జోడించడం.. అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలా ఇంకెవ్వరూ చేయలేదు. ఇండస్ట్రీ పట్ల చిరుకు ఉన్న కమిట్మెంట్‌కు ఇది నిదర్శనం. బాధ్యత తీసుకున్న వాళ్ల మీద విమర్శలు చేయడం.. మేమైతేనా అంటూ బిల్డప్ ఇవ్వడం.. చాలా తేలిక. కానీ పరిశ్రమ బాగు కోసమని, వ్యక్తిగత ప్రతిష్ఠ గురించి ఆలోచించకుండా తలొంచి మాట్లాడటం చిరు గొప్ప సంస్కారానికి రుజువు. ఈ విషయంలో ఆయనకు ఇండస్ట్రీ సెల్యూట్ కొట్టాల్సిందే.
This post was last modified on September 20, 2021 3:48 pm
వైసీపీ నాయకుడు, గత వైసీపీ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయకుడు, విజయవాడ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ…
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు…
వైసీపీ అధినేత జగన్కు ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…