ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అన్నీ ‘పాన్ ఇండియా’ సినిమాలే చేస్తున్నాడు. ఐతే తన దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయేది ‘పాన్ వరల్డ్ మూవీ’ అంటూ ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్. ‘మహానటి’తో తనపై భారీగా అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ కోసం దాదాపు మూడేళ్లు ఎదురు చూసి మరీ ఈ సినిమాను పట్టాలెక్కించాడు. రెండు నెలల కిందటే ఈ సినిమా లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ మీద తొలి షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ షెడ్యూల్లో ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొనలేదు. హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. తొలి షెడ్యూల్ చాలా తక్కువ రోజుల్లో షార్ట్‌గా ముగిసిపోయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని తర్వాతి షెడ్యూల్‌కు సన్నాహాలు చేసుకుంటోంది చిత్ర బృందం.
తాజా సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. నవంబరులో తర్వాతి షెడ్యూల్లోకి వెళ్లనుందట. తొలి షెడ్యూల్‌లాగా ఇది నామమాత్రంగా ఉండట్లేదు. హీరో హీరోయిన్లు ప్రభాస్, దీపికా పదుకొనేలతో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్లో షూటింగ్‌కు హాజరవుతుందట. ఈ సినిమా కోసం సెట్టింగ్స్ ద్వారా ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించిందట ఆర్ట్ డైరెక్టర్ టీం. ఆ ప్రపంచంలోకే కాస్ట్ అండ్ క్రూ అడుగు పెట్టబోతోంది.
రెండో షెడ్యూల్లో భారీ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని, సినిమా ఔట్ పుట్ ఎలా ఉండబోతోందన్నది ఈ షెడ్యూల్లోనే తెలిసిపోతుందని.. చిత్ర బృందానికి ఇదిలా చాలా ముఖ్యమైన షెడ్యూల్ అని అంటున్నారు. ఇంకో నెల రోజుల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేసి, అస్త్ర శస్త్రాలతో నవంబరులో సెట్స్‌లోకి అడుగు పెట్టబోతోంది చిత్ర బృందం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా దీన్ని చెబుతున్నారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
This post was last modified on September 20, 2021 7:38 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…