యాక్షన్ హీరో గోపీచంద్‌కు హిట్ చాలా అవసరమైన స్థితిలో వచ్చిన సినిమా ‘సీటీమార్’. చివరగా 2014లో ‘లౌక్యం’తో హిట్టు కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సక్సెస్ రుచి చూడనే లేదు. ఈ ఏడేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో ‘సీటీమార్’పై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ అదీ చూస్తే ప్రామిసింగ్‌గానే కనిపించింది. మాస్ మెచ్చే సినిమాలా అనిపించింది.
ఈ సినిమాకు ఉన్నంతలో మంచి టాకే వచ్చింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. దీంతో చిత్ర బృందం హడావుడి మామూలుగా లేదు. ‘బ్లాక్‌బస్టర్ సీటీమార్’ అంటూ జోరుగా ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సక్సెస్ మీట్ కూడా పెట్టి ఆ వేడుకను పెద్ద రేంజిలోనే చేశారు.
కానీ చిత్ర బృందం హడావుడికి.. తర్వాత బాక్సాఫీస్ పెర్ఫామెన్స్‌కు సంబంధం లేదు. వీకెండ్లోనే తడబడ్డ ‘సీటీమార్’.. ఆ తర్వాత అస్సలు నిలబడలేకపోయింది. తొలి రోజు రూ.4 కోట్ల దాకా షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల వీకెండ్లో మూడున్నర కోట్లే వసూలు చేయగలిగింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో వచ్చిన షేర్ కోటిన్నర మాత్రమే. ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం రూ.9 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఈ వారం వచ్చిన ‘గల్లీ రౌడీ’ బ్యాడ్ టాక్‌తో రన్ అవుతుండటం కలిసొచ్చే అంశమే అయినా.. దాన్నేమీ ‘సీటీమార్’ ఉపయోగించుకుంటున్నట్లు లేదు.
బుకింగ్స్, వసూళ్లు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. చివరికి సీటీమార్ షేర్ రూ.10 కోట్ల లోపే ఉండేలా కనిపిస్తోంది. అదే జరిగితే బ్రేక్ ఈవెన్‌కు రూ.2 కోట్ల దూరంలో ఆగిపోయి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ‘ఫ్లాప్’ అనిపించుకోబోతున్నట్లే. తక్కువ రేట్లకు థియేట్రికల్ రేట్స్ అమ్మినప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మాస్ సినిమా ఇంత తక్కువ షేర్ కలెక్ట్ చేయడం నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on September 20, 2021 7:13 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…