సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం రిపబ్లిక్ సినిమాను అక్టోబరు 1న రిలీజ్ చేయబోతున్నట్లు చాన్నాళ్ల ముందే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల ముందే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం కొన్ని రోజుల కిందటే అయిపోయాయి. ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసేశారు. ఇక ప్రమోషన్ల హడావుడి మొదలుపెట్టాలనుకున్న టైంలో అతడికి యాక్సిడెంట్ అయింది. ఇదేమీ చిన్న ప్రమాదం కాదు. అతను రెండు రోజులు స్పృహలో లేడు. వారం రోజులకు పైగా తేజుకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించాల్సి వచ్చింది. అతడికో సర్జరీ సైతం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అక్టోబరు 1 నుంచి వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది. సినిమా విడుదలకు పది రోజలు ముందు హీరో ఆసుపత్రిలో ఉంటే ఇక రిలీజ్ ఎలా అనే సందేహాలు కలిగాయి.
తేజు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడనే విషయంలో క్లారిటీ లేదు. అతనైతే ప్రమోషన్లకు హాజరయ్యే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. దీంతో వాయిదా అనివార్యం అనుకున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం రిలీజ్ డేట్‌కు కట్టుబడింది. సెన్సార్ కూడా పూర్తి చేయించి.. అక్టోబరు 1నే రిపబ్లిక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన ఇచ్చింది. సినిమాకు సెన్సార్ వాళ్లు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. తేజు పవర్ ఫుల్ లుక్‌లో ఉన్న లుక్‌తో రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ వదిలారు.
ప్రస్థానం ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సామాజిక అంశాలు, రాజకీయాల చుట్టూ తిరిగే కథతో రూపొందింది. తేజు సరసన ఇందులో ఐశ్వర్యా రాజేష్ నటించింది. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. తేజు కొంచెం కోలుకున్నాక, రిలీజ్ ముంగిట వీడియో బైట్స్ ద్వారా తన చిత్రాన్ని ప్రమోట్ చేస్తాడేమో చూడాలి.
This post was last modified on September 19, 2021 9:55 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…