టాలీవుడ్లో పక్కా ప్రేమకథలు చేసే కథానాయకులు కొద్దిమందే. అందులో నితిన్ ఒకడు. కెరీర్లో అతను ఎక్కువగా సినిమాలు చేసిన జానర్ అంటే లవ్ స్టోరీనే. నితిన్ లాస్ట్ రిలీజ్ ‘రంగ్ దె’ కూడా ప్రేమకథ అన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రేమకథలకు బాగా సూటయ్యే ఈ హీరో ‘రంగ్ దె’ ప్రమోషన్ల సమయంలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇకపై తాను ప్రేమకథలు చేయనని.. తన చివరి లవ్ స్టోరి ‘రంగ్ దె’నే అన్నాడు.
నితిన్‌కు పెద్దగా వయసేమీ అయిపోలేదు. యంగ్‌గానే కనిపిస్తున్నాడు. ఇంకో ఐదారేళ్లు ప్రేమకథలకు సూటయ్యేలాగే కనిపిస్తున్నాడు. టాలీవుడ్లో ప్యూర్ లవ్ స్టోరీలు చేసే, అవి నప్పే హీరోలే తక్కువమంది. అందులో ఒకడైన నితిన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలామందికి మింగుడు పడలేదు. ఈ స్టేట్మెంట్ ఏదో ఆవేశంలో ఇచ్చి ఉంటాడని.. తర్వాత ఆలోచన మార్చుకుంటాడని అనుకున్నారు.
కానీ నితిన్ తన మాటకు కట్టుబడే ఉన్నాడు. తన కొత్త చిత్రం ‘మాస్ట్రో’ ప్రమోషన్లలో భాగంగా మరోసారి అదే మాటను నొక్కి వక్కాణించాడు. తాను ఇకపై ప్రేమకథలు చేయను అనేశాడు. ఇందుకు తగ్గట్లే అతడి కొత్త ప్రాజెక్టులు సెట్ అవుతున్నాయి. దర్శకుడిగా మారుతున్న ఎడిటర్ శేఖర్‌తో చేయబోతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని స్పష్టమవుతోంది. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోయేది కూడా యాక్షన్ ఎంటర్టైనరే. కృష్ణచైతన్యతో చేయాలనుకుని హోల్డ్‌లో పెట్టిన ‘పవర్ పేట’ సైతం యాక్షన్ టచ్ ఉన్న గ్యాంగ్‌స్టర్ డ్రామానే. అది భవిష్యత్తులో పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
మొత్తానికి నితిన్ లైనప్ చూస్తుంటే మాస్, యాక్షన్ బాట పట్టినట్లు కనిపిస్తోంది. లవ్ స్టోరీల జోలికే వెళ్లే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. ప్రేమకథలతో మంచి విజయాలే అందుకున్నప్పటికీ ఆ జానర్ మీద నితిన్‌కు ఇంతగా ఎందుకు వ్యతిరేక భావం వచ్చేసిందో అర్థం కావడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates