Movie News

డేగ‌ల బాబ్జీగా ‘కొత్త’ హీరో


టాలీవుడ్లోకి ఒక కొత్త హీరో వ‌స్తున్నాడు. ఆ హీరో పేరు బండ్ల గ‌ణేష్‌. 90వ ద‌శ‌కం నుంచే సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ గ‌ణేష్ ఇప్ప‌టిదాకా స‌హాయ, కామెడీ పాత్ర‌లే చేస్తూ వ‌చ్చాడు. హీరో అవ‌తారం ఎత్త‌లేదు. న‌టుడిగా సినిమాలే ఆపేసి పూర్తి స్థాయిలో నిర్మాత అవ‌తారం ఎత్తిన అత‌ను.. ఈ మ‌ధ్య‌నే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో కామెడీ పాత్ర‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

మ‌ళ్లీ గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఏకంగా హీరో అయిపోయాడు. ఈ మ‌ధ్య‌నే ఆ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ఒకే పాత్ర ఉండే ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇంత‌కుముందే ఆన్ లొకేష‌న్ పిక్ రిలీజ్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. ఇప్పుడు సినిమా టైటిల్ రివీల్ చేశాడు. ఈ చిత్రానికి డేగ‌ల బాబ్జీ అనే పేరు పెట్టారు.

బండ్ల గ‌ణేష్ క‌న్ను.. దానిపై కుట్లు క‌నిపిస్తున్న‌ట్లుగా ఒక వ‌యొలెంట్ ప్రి లుక్‌తో టైటిల్ రివీల్ చేశారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ టైటిల్ లుక్‌ను లాంచ్ చేశాడు. డేగ‌ల బాబ్జీ అనే పేరు.. ప్రి లుక్ చూస్తే సినిమా కొంచెం వ‌యొలెంట్‌గా ఉంటుంద‌నిపిస్తోంది. ఈ చిత్రం త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఒత్త సెరుప్పు సైజ్ 7 ఆధారంగా తెర‌కెక్కుతోంది. త‌మిళంలో ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు పార్తీబ‌న్ త‌నే లీడ్ రోల్ చేస్తూ స్వీయ ద‌ర్వ‌క‌త్వం, నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాలో కేవ‌లం ఒక్క పాత్రే ఉంటుంది.

త‌మిళంలో మంచి ప్ర‌యోగంగా పేరు తెచ్చుకుని క‌మ‌ర్షియ‌ల్‌గానూ స‌క్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా రీమేక్ చేస్తుండ‌టం విశేషం. తెలుగులో బండ్ల హీరోగా వెంక‌ట్ చంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. స్వాతి చంద్ర‌, రిషి అగ‌స్త్య నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని చూస్తున్నారు.

This post was last modified on September 18, 2021 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago