పెర్ఫెక్షన్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి అసలు రాజీ పడరు. అందుకే ఆయన ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటూ ఉంటారు. భారీ బడ్జెట్ తో తీసిన సన్నివేశాలు కూడా ఆయనకు నచ్చకపోతే మళ్లీ రీషూట్ చేస్తారే కానీ ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ రాజమౌళి పెర్ఫెక్షన్స్ పేరుతో తనకు నచ్చని సన్నివేశాలన్నీ రీషూట్ చేస్తున్నారు.
రీసెంట్ గా రషెస్ చూసుకున్న రాజమౌళికి సినిమాలో ఎన్టీఆర్-ఒలీవియా మోరిస్ ల మధ్య సన్నివేశాలు సంతృప్తిగా అనిపించలేదట. వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో రాలేదని ఫీలైన రాజమౌళి.. ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ ను మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. బ్రిటీష్ దొరసానితో మన్యం దొర ప్రేమకథ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను మరింత పెంచేసింది.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మొన్నామధ్య దసరా కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. ప్రమోషన్స్ హడావిడి కూడా చేశారు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి షాకిచ్చింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఇప్పుడు సంక్రాంతి బరిలో విడుదలవుతుందని కొందరు.. వేసవికి రిలీజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మరి రాజమౌళి ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో..!
This post was last modified on September 18, 2021 8:49 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…