ఒకప్పుడు టాలీవుడ్ టాప్-4 హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకడు. మిగతా ముగ్గురు టాప్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో దీటుగా సినిమాలు చేసేవాడు. విజయాలూ అందుకునేవాడు. కానీ తర్వాతి తరం కథానాయకుల జోరు ముందు నాగ్ నిలవలేకపోయాడు.
అప్పుడప్పుడూ కొన్ని విజయాలందుకున్నప్పటికీ ఆయన క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో బాగా దెబ్బ తినేశాయి. ఇప్పుడు నాగ్ స్టార్ డమ్ అంతగా పని చేయట్లేదు. తన కొడుకులకు కూడా ఆయన అండ సరిపోవట్లేదు.
నాగ్ ఎంతగా ప్రయత్నించినా తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్‌ను నాగ్ హీరోగా నిలబెట్టలేకపోయాడు. ఆయన ప్లాన్ చేసిన తొలి మూడు సినిమాలు పరాజయాల పాలయ్యాయి. అందులోనూ ఎంతో శ్రద్ధ పెట్టి, దగ్గరుండి తీయించిన హలో కూడా దెబ్బ కొట్టేసింది. దీంతో చివరికి నాగ్.. కొడుకు కోసం మెగా గడప తొక్కాడు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్ బేనర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేయించాడు. గతంలో చైతూ స్ట్రగులవుతున్నపుడు కూడా ఇదే బేనర్లో 100 పర్సంట్ లవ్ చేయించడం తెలిసిందే.
అంతే కాదు.. తన సినిమాలకు, తన కొడుకుల సినిమాలకు నాగ్ ప్రమోషన్ పరంగా కూడా మెగా బ్రాండ్ వాడుతుండటం గమనార్హం. వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ ముంగిట ప్రచారం కోసం చిరంజీవి సపోర్ట్ తీసుకోవడం తెలిసిన విషయమే. ఇప్పుడు తన పెద్ద కొడుకు నాగచైతన్య కొత్త చిత్రం లవ్ స్టోరి రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరును వెంటబెట్టుకుని వస్తున్నాడు నాగ్. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ చిరంజీవిని అతిథిగా రప్పించడం ఆశ్చర్యమే. ఇది చూసి అక్కినేని వారి మెగా వాడకం మామూలుగా లేదని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
This post was last modified on September 17, 2021 11:36 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…