కరోనా తగ్గుముఖం పట్టినా ఓటీటీ హవా ఏమీ తగ్గలేదు. థియేటర్లు పునఃప్రారంభమై పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు ఓటీటీ బాట పడుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో నారప్ప, వివాహ భోజనంబు, నెట్, టక్ జగదీష్.. ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు ఓటీటీల ద్వారా రిలీజయ్యాయి. వీటిలో కొన్ని చిత్రాలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. థియేటర్లలో రిలీజైన సినిమాలను మించి అవి స్పందన తెచ్చుకున్నాయి.
వినాయక చవితి కానుకగా సీటీమార్, తలైవి చిత్రాలు థియేటర్లలో విడుదల కాగా.. అదే రోజు టక్ జగదీష్ అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సీటీమార్, తలైవి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా సరే.. వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. సీటీమార్ వీకెండ్ వరకు జోరు చూపించి ఆ తర్వాత చల్లబడిపోయింది. తలైవి అసలేమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. అదే సమయంలో టక్ జగదీష్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు సినిమాల వరకు రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. కాగా ఈ వారం కూడా థియేటర్ వెర్సస్ ఓటీటీ ట్రెండ్ చూడబోతున్నాం.
సందీప్ కిషన్ మూవీ గల్లీ రౌడీ బిగ్ స్క్రీన్లలో రిలీజవుతుంటే.. నితిన్ మూవీ మాస్ట్రో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు విజయ్ సేతుపతి-తాప్సిల అనాబెల్ సేతుపతి మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలనూ హాట్ స్టారే స్ట్రీమ్ చేయనుంది. ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ క్రేజ్ కనిపిస్తున్నది మాస్ట్రోకే. గల్లీ రౌడీ కూడా ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే దేనికి ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. మంచి ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న గల్లీ రౌడీకి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లలో సందడి కనిపించొచ్చు. మాస్ట్రో రీమేక్ మూవీ కాబట్టి మినిమం గ్యారెంటీ అనిపిస్తోంది. మరి అనాబెల్ సేతుపతికి అంతగా బజ్ లేదు. మరి ఈ వారం అయినా ఓటీటీ మీద థియేటర్ పైచేయి సాధిస్తుందా.. లేక గత వారం ట్రెండే కొనసాగుతుందా అన్నది చూడాలి.
This post was last modified on September 16, 2021 7:25 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…