షారుఖ్‌-అట్లీ టైటిల్ అలా బ‌య‌టికొచ్చేసింది


అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారుఖ్ ఖాన్.. తొలిసారి ఈ స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చిన‌పుడు చాలామందికి న‌మ్మ‌శక్యంగా అనిపించ‌లేదు. షారుఖ్ ఏంటి.. సౌత్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్‌తో ప‌ని చేయ‌డ‌మేంటి.. అందులోనూ ప‌క్కా సౌత్ ఇండియ‌న్ లోక‌ల్, మాస్ సినిమాలు తీసే అట్లీతో షారుఖ్ జ‌ట్టు క‌ట్ట‌డం ఏంటి అనిపించింది. కానీ చివ‌రికి నిజంగానే షారుఖ్‌.. అట్లీతో సినిమాకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొద‌లైపోయింది కూడా. పుణెలో తొలి షెడ్యూల్ మొద‌లుపెట్టారు.

ఇలా షూటింగ్ మొద‌లైందో లేదో.. అలా ఈ సినిమా టైటిల్ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చేసింది. ల‌య‌న్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొద‌లుకావ‌డం విశేషం. అనుకోని విధంగా ఈ టైటిల్ మీడియాలోకి వ‌చ్చేసింది.

పుణెలో ఒక ప్రాంతంలో షూటింగ్ అనుమ‌తుల కోసం చిత్ర బృందం పెట్టుకున్న అప్లికేష‌న్ కాపీ మీడియాలోకి వ‌చ్చేసింది. అందులో సినిమా వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. టైటిల్ ల‌య‌న్ అని పేర్కొన్నారు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్లో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు.. ఇందులో షారుఖ్‌కు జోడీగా న‌య‌న‌తార న‌టిస్తున్న‌ట్లు కూడా ఈ అప్లికేష‌న్లో పేర్కొన్నారు. ద‌ర్శ‌కుడిగా అట్లీ కుమార్ అని పూర్తి పేరుంది. మొత్తానికి ఈ చిత్రానికి ల‌య‌న్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో షారుఖ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగానే ఉన్నారు.

ఈ టైటిల్‌ను బ‌ట్టి అట్లీ.. కింగ్ ఖాన్‌తో మంచి మాస్ మూవీ తీస్తున్నాడ‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. జీరో సినిమాతో మార్కెట్ బాగా దెబ్బ తిన్న షారుఖ్‌.. రెండేళ్ల‌కు పైగా విరామం తీసుకుని ప‌ఠాన్ అనే సినిమా మొద‌లుపెట్టాడు. అది చివ‌రి ద‌శ‌లో ఉండ‌గానే.. అట్లీ సినిమాను ప‌ట్టాలెక్కించాడు.