స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు దిల్ రాజు. దీనికి ‘ఐకాన్’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. నిజానికి ‘పుష్ప’ కంటే ముందుగా ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ.
సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాదిన కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ రేంజ్ పెరగడం ఖాయం. అందుకే తన తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు బన్నీ. ఈ క్రమంలో ‘ఐకాన్’ సినిమాను పాన్ ఇండియా సబ్జెక్ట్ గా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు.
నిజానికి ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు దర్శకుడు కొందరు నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. వారంతా కూడా తెలుగు ఆర్టిస్టులే. ఇప్పుడు వాళ్లందరినీ తీసేసి పాన్ ఇండియా యాక్టర్స్ ను రంగంలోకి దింపాలని బన్నీ హుకూం జారీ చేశాడట. దీంతో దర్శకుడు ఫస్ట్ అనుకున్న క్యాస్ట్ మొత్తాన్ని మార్చేసే పనిలో పడ్డారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పేరున్న తారలను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే, కృతిశెట్టిలను తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి!
This post was last modified on September 15, 2021 6:07 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…