సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఆయన తండ్రి కృష్ణ పుట్టిన రోజు ఆదివారమే కాగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమా ప్రకటన చేస్తాడా.. లేక ముహూర్త కార్యక్రమం నిర్వహిస్తారా అన్నది తెలియక టెన్షన్ పడిపోతున్నారు. ఈసారి కృష్ణ ఎలాంటి వేడుకలూ చేయొద్దని అభిమానులకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. పరశురామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా అనౌన్స్‌మెంట్‌ను మహేష్ రద్దు చేసుకున్నట్లు గుసగుసలు వినిపించాయి.
తర్వాత సింపుల్‌గా ముహూర్త కార్యక్రమం మాత్రం నిర్వహిస్తారని అన్నారు. ఈ సినిమాకు ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ప్రచారంలోకి రావడం.. దీనిపై మహేష్ సీరియస్ అయినట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోఆదివారం మహేష్ కొత్త సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఐతే దీని సంగతేమో కానీ.. కృష్ణ పుట్టిన రోజు నాడు మహేష్‌తో మాట్లాడే అవకాశం అభిమానులకు దక్కనుంది. రేపు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించబోతున్నాడు మహేష్. షూట్ యువర్ క్వశ్చన్స్ అంటూ అభిమానులకు అతను పిలుపునివ్వబోతున్నాడు. ఇందులో ప్రధానంగా మహేష్ కొత్త సినిమా, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించే చర్చ ఉంటుందనడంలో సందేహం లేదు.
ముందుగా పరశురామ్ సినిమా గురించి మహేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా టైటిల్ గురించి కూడా అభిమానులు అడుగుతారు. పరశురామ్ సినిమా తర్వాత ఏంది ఉంటుంది.. వంశీ పైడిపల్లితో ఇక పని చేయరా.. త్రివిక్రమ్‌తో మళ్లీ ఎప్పుడు జట్టు కడతారు.. రాజమౌళి సినిమా ఎప్పుడు.. అది ఏ జానర్లో ఉంటుంది.. ఇంకా ఎవరెవరితో పని చేయబోతున్నారు.. పాన్ ఇండియా సినిమాల సంగతేంటి లాంటి ప్రశ్నలు మహేష్‌కు ఎదురవుతాయి. వాటికి అతనేం బదులిస్తాడో చూడాలి.
This post was last modified on May 30, 2020 3:29 pm
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…