కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అక్కడున్న యంగ్ హీరోల్లో ధనుష్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. ముందుగా దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నారాయణ్ దాస్ కె నారంగ్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీని తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు ధనుష్.
ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు ధనుష్ తో సినిమాలు చేయబోతున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయబోయే సినిమాకి దర్శకుడిగా అజయ్ భూపతిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
మరోపక్క డీవీవీ దానయ్య.. ధనుష్ కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. సరైన కథ సెట్ అయితే ధనుష్ తో సినిమా మొదలుపెట్టడం ఖాయం. ఇప్పటికే ధనుష్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ధనుష్ టాలీవుడ్ లో నాలుగు సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా మారతాడేమో చూడాలి!
This post was last modified on September 13, 2021 3:21 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…