ఈనాడు పత్రిక ఆరంభమై జనాదరణ పొందిన తొలి నాళ్ల నుంచి ఆ పత్రికలో కార్టూనిస్ట్‌గా ఉంటూ.. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వ్యక్తి శ్రీధర్. ఈనాడును, శ్రీధర్‌ను ఎవ్వరూ కూడా వేరు చేసి చూడలేనంతగా ఆ పత్రికతో ఆయనకు అనుబంధం ఉంది. కొన్నేళ్ల కిందటే రిటైర్మెంట్ వయసు దాటేసినప్పటికీ.. ఎక్స్‌టెన్షన్ మీద ఆయన ఈనాడు కార్టూనిస్ట్‌గా కొనసాగుతూ వచ్చారు.
ఐతే ఇటీవల హఠాత్తుగా తాను ఈనాడు నుంచి బయటికొచ్చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు శ్రీధర్. ఇక అప్పట్నుంచి ఈనాడులో కార్టూన్ అన్నదే కనిపించడం లేదు. ఈనాడు యాజమాన్యంతో అభిప్రాయ భేదాలని, ఆయనకు కొందరు పెద్దలు పొమ్మనకుండా పొగబెట్టారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆరోగ్యం సహకరించక ఆయన ఈనాడుకు గుడ్‌బై చెప్పారని కూడా కొందరన్నారు.
ఐతే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలను శ్రీధర్ ఖండించారు కానీ.. తాను ఎందుకు ఈనాడు నుంచి వైదొలిగింది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే ఇక శ్రీధర్ విశ్రాంతి తీసుకుంటారా.. లేక వేరే మీడియా సంస్థలో చేరతారా అన్న దానిపై అమితాసక్తి నెలకొంది. ఈ విషయంలో శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. అంతరార్థం పేరుతో తాను యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. సమకాలీన రాజకీయాలపై ప్రతివారం ఇందులో విశ్లేషణ చేస్తానని ఆయన వెల్లడించారు.
ఐతే ఇది ఆదాయం కంటే కూడా ఒక వ్యాపకం లాగా చేయడానికి శ్రీధర్ నిర్ణయించుకున్నారని.. జనాలతో టచ్‌లో ఉండటానికి ఆయన ఎంచుకున్న మార్గం ఇదని.. వృత్తిగతంగా అయితే ఆయన రిటైరైనట్లే అని శ్రీధర్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో శ్రీధర్ కార్టూన్లకు కూడా స్థానం ఉంటుందని, కోట్లాది తన అభిమానులను ఆయన అలరిస్తారని ఆశిద్దాం.
This post was last modified on September 12, 2021 5:39 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…