హీరోగా అరంగేట్రంలో చేదు అనుభవం ఎదుర్కొని.. ఆపై అనూహ్యంగా విలన్ పాత్రల్లోకి మారి.. నెగెటివ్ రోల్స్‌లోనే మంచి గుర్తింపు సంపాదించుకుని.. తిరిగి హీరోగా మారి విజయాలందుకున్న నటుడు గోపీచంద్. అతడికి మాస్‌లో మంచి ఫాలోయింగే ఉంది. గోపీ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు భారీగానే ఉంటాయి.
ఐతే ఎలాంటి స్టార్‌కైనా అడపాదడపా విజయాలు అవసరం. వరుసగా ఫ్లాపులు వస్తే ఎంత స్టార్ అయినా తట్టుకోవడం కష్టమే. గోపీచంద్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అతను హిట్టు కొట్టి ఏడేళ్లు దాటిపోయింది. శ్రీవాస్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘లౌక్యం’ తర్వాత అతడికి సక్సెస్ అన్నదే లేదు.
ఎన్నో అంచనాలు పెట్టుకున్న గౌతమ్ నంద, పంతం లాంటి సినిమాలు అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘సీటీమార్’పై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంపై అతను ధీమాగా కూడా ఉన్నాడు.
వినాయక చవితి కానుకగా ఈ శుక్రవారం రిలీజైన ‘సీటీమార్’ టార్గెటెడ్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ.. మాస్‌ను మెప్పించే అంశాలకు లోటు లేని చిత్రమిది. కమర్షియల్ మీటర్లో ఎక్కడా ఏదీ తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు సంపత్ నంది.
‘గౌతమ్ నంద’లో మిస్సయిన మాస్ అంశాలు ఇందులో ఉన్నాయి. గోపీచంద్ నుంచి తన అభిమానులు ఆశించే యాక్షన్ డోస్ బాగానే ఉండటం.. తమన్నా గ్లామర్ కూడా బాగానే ప్లస్ కావడం.. కొంతమేర సెంటిమెంట్ కూడా వర్కవుట్ కావడంతో సినిమా పైసా వసూల్ అనిపిస్తోంది. కరోనా ధాటికి దారుణంగా దెబ్బ తిన్న సింగిల్ స్క్రీన్లకు ఈ చిత్రం ఊపిరి పోస్తోంది.
కొవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఇండియాలోనే ఇది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం. శని, ఆదివారాల్లోనూ మంచి వసూళ్లే వస్తాయిని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసి థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినందుకు మంచి ఫలితమే దక్కేలా ఉంది. హిట్టు కోసం ఏడేళ్లుగా సాగుతున్న గోపీ నిరీక్షణ ఫలించేలాగే కనిపిస్తోంది.
This post was last modified on September 12, 2021 1:31 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…