మహమ్మారి వైరస్ వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగం కూడా కుదేలైంది. షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు, రిలీజ్ లు ఆగిపోవడంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు…ఒకరేమిటి…సినీ రంగానికి చెందిన పలువురు లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో, షూటింగులకు అనుమతినివ్వాలని సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఈ విషయంపై చిరంజీవి ఇంట్లో నాగార్జునతో పాటు మరికొందరు సినీ ప్రముఖులతో తలసాని భేటీ అయ్యారు.
అడిగిన వెంటనే సినీ ఇండస్ట్రీ సమస్యలపై స్పందించిన తలసానికి ఇపుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ భేటీకి తనను పిలవలేదని…చర్చలపేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బాలకృష్ణ చేసిన విమర్శలు దుమారం రేపాయి. దీంతో, తలసాని ఆ భేటీపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తాము ఎవరినీ ప్రత్యేకంగా పిలవలేదని….షూటింగుల్లో సడలింపుల విషయంలో కొంతమంది యాక్టివ్ గా ఉన్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపామని తలసాని అన్నారు. కావాలంటే మరోసారి ఇండస్ట్రీలోని అందరినీ పిలిచి మీటింగ్ పెడతామని చెప్పారు. దీంతో, ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే తలసానికి చెడు ఎదురైందని నెటిజన్లు అనుకుంటున్నారు. నారీ నారీ నడుమ మురారి తరహాలో…హీరో…హీరో నడుమ తలసాని అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శిస్తున్నారు.
ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఉన్న ఇగో క్లాషెస్ కరోనా టైంలోనూ వీడడం లేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి…లాక్ డౌన్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు ఎలా జరుపుకుందామని చర్చించుకోవాల్సింది పోయి,ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఈ తరహాలో రచ్చ చేసుకుంటే….ప్రభుత్వం అసలు అనుమతులే ఇవ్వకుండా పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మరి, ఇప్పటికైనా ఇగోను వీడి మన హీరోలు ఒక మాట మీద నిలబడితే మంచిదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
This post was last modified on May 30, 2020 2:19 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…