బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను సెప్టెంబర్ 3న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారని అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ మా అమ్మ అరుణ భాటియా ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను.’
‘ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతగ్నతలు. ఓం శాంతి’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా.. అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు, నెటీజన్లు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ లు చేస్తున్నారు.