Movie News

పూరీ సార్‌ను అడుగుతూనే ఉన్నా-కంగ‌నా

బాలీవుడ్లో ఒక మామూలు గ్లామ‌ర్ డాల్ హీరోయిన్ లాగా ఉన్న టైంలో ద‌క్షిణాదిన కూడా రెండు సినిమాలు చేసింది కంగ‌నా ర‌నౌత్‌. త‌మిళంలో ధామ్ ధూమ్ అనే చిత్రంలో జ‌యం ర‌వితో జోడీ క‌ట్టిన ఆమె.. తెలుగులో ప్ర‌భాస్‌కు జోడీగా ఏక్ నిరంజ‌న్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం కంగ‌నా పాత్ర ఏమంత గొప్ప‌గా ఉండ‌దు. గ్లామ‌ర్ ప‌రంగా మాత్రం కంగ‌నా ఆక‌ట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో తెలుగులో కంగ‌నాకు మ‌ళ్లీ అవ‌కాశాలు రాలేదు. ఈ లోపు బాలీవుడ్లో ఆమె రేంజే మారిపోయింది.

క్వీన్ సినిమాతో మంచి పెర్ఫామ‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. చూస్తుండ‌గానే పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. కొన్నేళ్లుగా ఎక్కువ‌గా హీరోయిన్ కొంచెం పెద్ద స్థాయిలో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ఇప్పుడు త‌లైవి సినిమాతో సౌత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కంగ‌నాను.. ఇంత‌కీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు అని అడిగారుమీడియా వాళ్లు. ఐతే ఇక్క‌డ సినిమాలు చేయొద్ద‌ని త‌న‌కేమీ లేద‌ని.. త‌న‌కు తెలుగులో తొలి అవ‌కాశం ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఇంకో ఛాన్స్ కోసం త‌ర‌చుగా అడుగుతూనే ఉంటాన‌ని కంగ‌నా వెల్ల‌డించింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న ఇంకో సినిమా చేసే అవ‌కాశం ఇప్పుడు ఇప్పించ‌మ‌ని కూడా పూరీని అడుగుతుంటాన‌ని ఆమె అంది. పూరీ నుంచి పిలుపు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కూడా ఆమె చెప్ప‌డం విశేషం.

త‌లైవిలో జ‌య‌ల‌లిత‌గా క‌నిపించ‌డం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ట‌వుతుంద‌ని కంగ‌నా ధీమా వ్య‌క్తం చేసింది. త్వ‌ర‌లో తాను ఇందిరాగాంధీ బ‌యోపిక్‌లో కూడా న‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. మోడీ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న‌కు రెండు జాతీయ పుర‌స్కారాలు రావ‌డంపై స్పందిస్తూ.. అంత‌కుముందు కాంగ్రెస్ హ‌యాంలో కూడా త‌న‌కు రెండు అవార్డులు వ‌చ్చిన సంగ‌తి ఎందుకు మ‌రిచిపోతున్నార‌ని కంగ‌నా ప్ర‌శ్నించింది.

This post was last modified on September 7, 2021 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆగకుండా ఆగమాగం చేస్తున్న దురంధర్

దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…

6 hours ago

సహానా సహానా… అంచనాలు అందుకున్నానా

రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…

7 hours ago

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…

9 hours ago

‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…

11 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

11 hours ago

కొత్త రిలీజుల తాకిడి… అవతారే పైచేయి

అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…

12 hours ago