ఒక సామాన్యుడు పెద్దింటి అమ్మాయిని.. సెలబ్రెటీని ప్రేమించే కథలు గతంలో చాలా చూశాం. ‘ఆటోడ్రైవర్’ సినిమాలో అయితే మిస్ ఇండియా వచ్చి ఒక ఆటోవాలాను ప్రేమించేస్తుంది. కానీ ఆ రోజుల్లో కథలు నడిచే తీరు వేరుగా ఉండేది. హీరో ఎంత సామాన్యుడైనా సరే.. అసామాన్యమైన పనులు చేసేస్తుంటాడు. పెద్దింటి అమ్మాయిలు ఈ పేద హీరోలకు ఈజీగా పడిపోతుంటారు. అలాంటి కథలకు రోజులు చెల్లాయి. ఇప్పుడంతా రియలిస్టిగ్గా ఉండాలి.
ఒక మామూలు కుర్రాడికి.. పెద్దింటి అమ్మాయికి ప్రేమాయాణం నడిపినా.. అది వాస్తవికంగా అనిపించాలి. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్న తలెత్తకూడదు. ఇలా కథల్ని నడపడం కత్తి మీదే సామే. ఆహా ఓటీటీ ఇప్పుడు ఇలాంటి ఓ సాహసోపేత కథతోనే ఓ వెబ్ ఫిలిం రూపొందించింది. అదే.. బేకర్ అండ్ బ్యూటీ. ‘ఏక్ మిని కథ’తో సత్తా చాటుకున్న సంతోష్ శోభన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది.
అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంతోష్ సరసన టీనా శిల్పరాజ్, విష్ణు ప్రియ జంటగా నటించారు. ఈ మధ్య ‘ఇచ్చట వాహనములు నిలుపురాదు’తో రీంట్రీ ఇచ్చిన వెంకట్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో హీరో ఒక బేకర్ కాగా.. కథానాయిక ఏమో సినిమా హీరోయిన్. ముందు తన రేంజికి తగ్గట్లుగా ఓ అమ్మాయితో డేటింగ్ చేసి ఫెయిలయ్యాక.. సినిమా హీరోయిన్‌కు చేరువ అవుతాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణమే ఈ కథలో మేజర్ హైలైట్ లాగా కనిపిస్తోంది.
టీజర్ ఆద్యంతం కలర్‌ఫుల్‌గా, ఆసక్తికరంగానే సాగింది. యూత్‌కు నచ్చేలా లిప్ లాక్‌లు, ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. వెబ్ ఫిలిం కాబట్టి అందుకు తగ్గట్లుగా సెటప్ కుదిరినట్లుంది. ‘ఏక్ మిని కథ’తో తొలి విజయాన్నందుకున్న ఊపులో సంతోష్ హుషారుగా నటించినట్లున్నాడు. ఈ నెల 10న ‘బేకర్ అండ్ బ్యూటీ’ ప్రిమియర్స్ పడనున్నాయి.
This post was last modified on September 6, 2021 7:12 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…