స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది.
ఇప్పుడు ‘ఐకాన్’ను పూర్తి చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బన్నీతో రెండు సినిమాల్లో కలిసి పని చేసిన పూజాహెగ్డే ఇప్పుడు మూడోసారి అతడితో జతకట్టబోతుంది. ఇదిలా ఉండగా.. కథ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కి కూడా ప్రాధాన్యత ఉంది. ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతిశెట్టిని తీసుకోవాలనుకుంటున్నారు.
‘ఉప్పెన’ సినిమాతో కుర్రకారుని ఆకట్టుకున్న కృతికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని, రామ్ లాంటి పేరున్న హీరోలతో కలిసి నటిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే ఇక టాప్ లీగ్ లోకి చేరిపోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం నార్త్ లో జరగనుంది.
This post was last modified on September 6, 2021 2:38 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…