పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దయా గుణం గురించి చెప్పడానికి చాలా ఉంది. నటుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయం నుంచి అతడి సేవా భావం గురించి అందరికీ తెలిసిందే. కార్గిల్ యుద్ధ సమయంలో వీర సైనికుల కోసం విరాళం ఇవ్వడం దగ్గర్నుంచి.. గత రెండు దశాబ్దాల్లో పవన్ తన సేవా భావాన్ని చాటుకున్న ఉదంతాలు ఎన్నో. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఎన్నోసార్లు వివిధ సేవా కార్యక్రమాల కోసం విరాళాలు అందజేసిన పవన్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక మరింతగా తన ఉదారతను చాటుకున్నాడు.
ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఓ పేద కళాకారుడిని ఆదుకోవడానికి పవన్ ముందుకొచ్చాడు. ఆ కళాకారుడే.. దర్శనం మొగిలయ్య. తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం తన గొంతును అరువిచ్చిన మొగిలయ్యకు పవన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది.
జానపద కళాకారుడైన మొగిలయ్య గురించి మొన్నటిదాకా జనాలకు పెద్దగా తెలియదు. అంతర్ధానం అయిపోతున్న 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ ప్రాచీన కళను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అరుదైన కళాకారుడు మొగిలయ్య. కొన్ని నెలల ముందు వరకు బస్టాండ్లలో పాటలు పాడుతూ డబ్బులు యాచించడం ద్వారా అతి కష్టం మీద జీవనం సాగిస్తూ వచ్చాడు మొగిలయ్య. ఆయన గురించి ఓ పత్రికలో వార్త రావడంతో ప్రభుత్వం స్పందించి కొంత సాయం అందించింది.
జానపదాల మీద పవన్ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తాడన్న సంగతి తెలిసిందే. ఆయన గత సినిమాలు చాలా వాటిలో జానపదాలు చూడొచ్చు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌ను కూడా ఫోక్ స్టయిల్లో చేశారు. ఈ పాటలో ఆరంభ గానం మొగిలయ్యతోనే చేయించారు. ఈ సందర్భంగా మొగిలయ్య గురించి తెలుసుకుని పవన్.. తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ద్వారా ఆయనకు రూ.2 లక్షల సాయాన్ని అందజేశారు.
This post was last modified on September 6, 2021 10:33 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…