టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రూటే వేరు. ఆమె నటన, మాట, చేసే పనులు అన్నీ భిన్నంగా ఉంటాయి. కేవలం తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానుల్ని సంపాదించుకోవడం సమంత ప్రత్యేకత. ఆమె అప్పుడప్పుడూ నెటిజన్లతో చేసే చిట్‌చాట్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. అవి ఆమె ప్రత్యేకతను చాటి చెబుతుంటాయి.
తాజాగా సమంత మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్.. మిమ్మల్ని ద్వేషించే వారిపై (హేటర్స్) మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే.. వాళ్లకు తాను రుణపడి ఉంటానని చెప్పింది సామ్.
పొగడ్తలు వింటే తాను చాలా బద్ధకంగా తయారవుతుంటానని.. అలా కాకుండా తనను విమర్శిస్తూ ఉంటే కష్టపడి పని చేసి మంచి ఔట్ పుట్ ఇస్తానని.. కాబట్టి తాను మెరుగవడానికి కారణమవుతున్న హేటర్స్‌కు తాను థ్యాంక్స్ చెబుతానని అంది సామ్.
ఇక క్వారంటైన్ టైంలో మీరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి అని అడిగితే.. మనం పెద్ద పెద్ద కలల వెనుక పరుగులు పెట్టాల్సిన పని లేదు, ఇంట్లో కుటుంబంతో కలిసి ఖాళీగా ఉండటమే ఒక కల అని తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. నాగచైతన్య, అఖిల్‌ల గురించి ఏమంటారు అనడిగితే.. ‘బెస్ట్ జీన్స్’ అని బదులిచ్చింది సామ్.
అత్యంత ఇష్టమైన సినిమా గురించి అడిగితే.. చిన్నప్పట్నుంచి తనకు ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చాలా నచ్చిన సినిమా అని చెప్పింది. అభిమానుల గురించి చెప్పమంటే.. వాళ్లు బలమే కాదు బలహీనత కూడా అని సమంత అంది.
లాక్ డౌన్ టైంలో ఫిట్‌గా ఎలా ఉంటున్నారు అడిగితే.. నిజానికి తాను స్పైసీ ఫుడ్ బాగా ఇష్టపడతానని, తరచుగా బిరియానీ తింటానని, ఈ మధ్యే మూడు ఆవకాయ బాటిళ్లు ఖాళీ చేశానని.. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉంటూ, వ్యామామాలు చేస్తూ ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నానని సమంత అంది.
This post was last modified on May 29, 2020 1:58 pm
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…