నేచురల్ స్టార్ నానీని చాలామంది ఓటీటీ స్టార్ అనేస్తున్నారు. టాలీవుడ్లో అతడి స్థాయి హీరోలు చాలామంది ఓటీటీలో అరంగేట్రమే చేయలేదు ఇప్పటిదాకా. కానీ నాని మాత్రం గత ఏడాది ‘వి’తో ఓటీటీ బాట పట్టాడు. ఇప్పుడు ‘టక్ జగదీష్’తో మరోసారి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘టక్ జగదీష్’ ఓటీటీ రిలీజ్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కానీ ఏ పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్‌కు రెడీ చేసింది నానితో పాటు నిర్మాతలు కూడా వివరణ ఇచ్చుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు.
ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో హెచ్చరికలు జారీ చేసిన ఎగ్జిబిటర్లు తర్వాత వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే నాని నుంచి మరో సినిమా ఓటీటీ బాట పట్టబోతున్నట్లు సమాచారం. ఐతే అది నాని నటించిన సినిమా కాదు.. నిర్మించిన సినిమా. ఆ చిత్రమే.. మీట్ క్యూట్.
నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా ‘మీట్ క్యూట్’. ఐదు కథలతో తెరకెక్కుతున్న ఆంథాలజీ ఫిలిం ఇది. ఓటీటీల కోసం ఇలాంటి సినిమాలు చాలానే తెరకెక్కడం చూశాం. ‘మీట్ క్యూట్’ సైతం ఓటీటీ టార్గెట్‌గానే తెరకెక్కుతోందట. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న రుహాని శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మీట్ క్యూట్’ ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
ఐతే నాని హీరోగా నటించిన సినిమా కాబట్టి ‘టక్ జగదీష్’ విషయంలో ఎగ్జిబిటర్లు అడ్డం పడ్డారు కానీ.. ‘మీట్ క్యూట్’ విషయంలో వారికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు. ఈ చిత్రంలో సత్యరాజ్, రోహిణి, వర్ష బొల్లమ్మ, ఆదాశర్మ, సునైనా, సంచిత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక ఎమోషనల్ టచ్ ఉన్న ఫీల్ గుడ్ మూవీ అని సమాచారం. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on September 2, 2021 1:18 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…