తెలుగులో దిగ్గజ నటుల జాబితా తీస్తే అందులో నరేష్ పేరు ఉండకపోవచ్చు. కానీ నటుడిగా ఆయనది దిగ్గజ స్థాయే. హీరోగా స్టార్ పెద్దగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోకపోయినా.. కామెడీ పాత్రలతో కోట్లమంది ప్రేక్షకుల మనసులు దోచడమే కాక ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న నరేష్.. హీరోగా అవకాశాలు తగ్గుతున్న దశలో కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చి చిన్న పెద్ద అని తేడా లేకుండా మంచి పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ తరం దర్శకులు చాలామంది క్యారెక్టర్ రోల్స్ అనగానే పరభాషా నటుల వైపే చూస్తారు. వాళ్ల పట్ల ఒక రకమైన మోజు కనిపిస్తుంది.
కోట శ్రీనివాసరావు అన్నట్లు ఫలానా పాత్రకు ఫలానా నటుడైతేనే న్యాయం చేయగలడని భావించి వేరే భాషల్లోని పేరున్న నటులను తీసుకొస్తే ఓకే కానీ.. మన వాళ్ల ప్రతిభను గుర్తించకుండా ప్రతి క్యారెక్టర్, నెగెటివ్ రోల్‌నూ వేరే భాషల ఆర్టిస్టులతో చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదు.
నరేష్ సంగతే తీసుకుంటే శతమానం భవతి, సమ్మోహనం లాంటి చిత్రాల్లో ఆయన ఎంత గొప్పగా నటించాడో తెలిసిందే. తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా చూసిన వాళ్లెవ్వరూ నరేష్ నటనను అంత సులువుగా మరిచిపోలేరు. చాలామంది క్యారెక్టర్ నటుల్లాగా హడావుడి చేయకుండా సటిల్ యాక్టింగ్‌తో హీరోయిన్ తండ్రి పాత్రను పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ముఖ్యంగా పతాక ఘట్టంలో నరేష్ నటన ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది. నరేష్ నటనకు ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే అనిపిస్తుంది. మంచి పాత్ర పడాలే కానీ.. నరేష్ ఎంత గొప్పగా నటించడగలడో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ. వాడుకోవాలే కానీ.. ఆయనలో ఇంకా చాలా కోణాలున్నాయనడంలో సందేహం లేదు. మన దర్శకులు ఇప్పటికైనా పరభాషా నటుల వెంట పడటం మాని.. మన దగ్గర ఉన్న వాళ్లలో కూడా మార్చి మార్చి అదే నటుల్ని క్యారెక్టర్ రోల్స్‌కు తీసుకోవడం మాని.. నరేష్ లాంటి దిగ్గజానికి ఆయన స్థాయికి తగ్గ పాత్రలివ్వాల్సిన అవసరం చాలా ఉంది.
This post was last modified on September 1, 2021 7:22 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…