బాహుబలి.. ఈ పేరెత్తితే భారతీయ సినీ ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా అనే భేదాలన్నింటినీ చెరిపేస్తూ ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు సినీ ప్రేక్షకులూ ఓన్ చేసుకుని ‘ఇది ఇండియన్ సినిమా’ అని పౌరుషంతో చెప్పుకునేలా చేసిన చిత్రమది.
ఆ సినిమా చూసి ఒక్కో ప్రేక్షకుడు పొందిన అనుభూతి గురించి ఏం చెప్పాలి? బహుశా భారతీయ సినీ ప్రేక్షకులకు అలాంటి కామన్ ఎమోషన్ తెచ్చిన సినిమా ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రం ప్రకంపనలు రేపింది. ఎన్నో దేశాల్లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. వసూళ్ల మోత మోగించింది. జపాన్ లాంటి దేశాల్లో అయితే బాహుబలి క్రేజ్ పతాక స్థాయికి చేరి రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్లు అక్కడ సూపర్ స్టార్లుగా మారిపోయారు.
ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై మూడేళ్లు దాటినా ఇంకా ఆ సినిమా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలో ‘బాహుబలి-2’ను టీవీల్లో ప్రసారం చేశారు. అది కూడా రష్యన్ భాషలో కావడం విశేషం. అక్కడి ప్రేక్షకులు అమితాసక్తితో ఈ చిత్రాన్ని చూస్తూ మన ప్రేక్షకుల్లాగే భావోద్వేగాలకు గురవుతున్నారు. ఓ రష్యన్ ఛానెల్లో రష్యన్ భాషలో ‘బాహుబలి-2’ ప్రసారమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
దేవసేన మీద మహిష్మతి సభలో విచారణ జరిగే సన్నివేశంలో రష్యన్ భాషలో డైలాగులు విని మనోళ్లు ఆశ్చర్యపో్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ముందు నుంచే పాపులర్ అయిన హిందీ సినిమాలు కూడా రష్యన్ భాషలో అనువాదమై ఇలా టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యుంటాయా అంటే సందేహమే. ఇది మన తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి. రాజమౌళి అయినా సరే.. ఇలాంటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయగలడా అంటే సందేహమే.
This post was last modified on May 29, 2020 10:05 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…