ట్విట్టర్ స్పేస్‌లు మొదట్లో ఎక్కువగా ఫ్యాన్ వార్స్‌కు మాత్రమే ఉపయోగపడ్డాయి కానీ.. ఇప్పుడు వాటిని బాగానే సద్వినియోగపరుస్తున్నారు సినీ జనాలు. మొదట్లో వీటిని ఫిలిం సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెమ్మదిగా సందర్భానుసారం ట్విట్టర్ స్పేస్‌లు పెట్టి పెద్ద పెద్ద వాళ్లను అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు.
సినీ ప్రముఖుల పుట్టిన రోజులు, ఇంకేవైనా ముఖ్యమైన రోజుల్లో అధికారికంగా స్పేస్‌లు పెట్టడం కామన్ అయిపోతోంది. ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునల పుట్టిన రోజులకు పెట్టిన ట్విట్టర్ స్పేస్‌లకు చాలా మంచి స్పందన వచ్చింది. ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్లున్న ప్రముఖులు చాలామంది వీటిలో పాల్గొని తమ అభిమాన హీరోల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇప్పుడు మరో బ్లాక్‌బస్టర్ స్పేస్‌కు రంగం సిద్ధమైంది.
సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మెగా స్పేస్ పెడుతున్నారు ట్విట్టర్లో. పవన్‌తో ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా తీస్తున్న అగ్ర దర్శకుడు క్రిష్‌తో పాటు పవన్‌ను దేవుడిగా కొలించే బండ్ల గణేష్, పవర్ స్టార్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీసిన బాబీ, ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి పవర్ స్టార్‌తో జట్టు కట్టబోతున్న హరీష్ శంకర్ తదితరులు ఈ స్పేస్‌లో పాల్గొనబోతున్నారు.
క్రేజ్ కా బాప్ అయిన పవన్ మీద స్పేస్ అంటే.. సెప్టెంబరు 2న ఇంకా మరింతమంది ప్రముఖులు ఇందులో పాల్గొనే అవకాశముంది. పవన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఏ విషయమైనా రికార్డ్ బ్రేకింగ్‌గానే ఉంటుంది. ఈ స్పేస్ విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవడం ఖాయమే అనుకుంటున్నారు. ఈ స్పేస్‌కు టాలీవుడ్లోనే రికార్డు స్థాయిలో అటెండెన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 1, 2021 11:36 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…