తెలుగులో ‘బస్ స్టాప్’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాల్లో నటించిన ఆనంది తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడే ఓ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైనప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. రీసెంట్ గా సుధీర్ బాబు సరసన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆనంది పెర్ఫార్మన్స్ కు మంచి పేరొచ్చింది. చక్కగా నటించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది.
క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన మరింత ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. సినిమా ప్రమోషన్స్ లో ఆనంది ఎక్కడా కనిపించలేదు. ఇకపై జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఆమె కనిపించదట. ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటి నుండి ఆనంది అసలు చిత్రబృందానికి టచ్ లేదట. సినిమా ప్రమోషన్స్ కోసం ఆనందిని తీసుకురావడానికి దర్శకనిర్మాత చాలానే ప్రయత్న్చారు. కానీ తన ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది.
ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. ఆనంది మాట్లాడలేదట. ఎలాగోలా ఆమెని కాంటాక్ట్ చేయగా.. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఆనంది ఆరు నెలల గర్భవతి. ఈ ఏడాదిలోనే వరంగల్ లో ఆమె వివాహం జరిగింది. ఇప్పుడు ఆమె గర్భవతి కావడంతో ప్రమోషన్స్ కి రాలేనని చెప్పిందట. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. టైటిల్ కూడా ఆమె పాత్ర పేరుతోనే డిజైన్ చేశారు. ఆమె వచ్చి ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు. కానీ చివరికి ఆమె గర్భవతినని చెప్పడంతో దర్శకనిర్మాతలు సైలెంట్ అయిపోయారు.
This post was last modified on August 30, 2021 4:53 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…