ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఇప్పుడో థియేటర్ ఏర్పాటైంది. సముద్ర మట్టాని కంటే ఏకంగా 11562 అడుగుల ఎత్తులో ఏర్పాటైన థియేటర్ అది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 28 డిగ్రీలు కావడం గమనార్హం. అలాంటి చోట మనిషి మామూలుగా బతకడమే కష్టం. అక్కడ థియేటర్ ఏంటి అనిపిస్తోందా? కానీ ఇది నిజం. ఈ అద్భుతం చోటు చేసుకున్నది ఇండియాలోనే కావడం విశేషం.
కేంద్ర ప్రాంత పాలితమైన లద్దాక్‌లో మంచు పర్వతాల మీద మంచుతో అంతా గడ్డ కట్టుకుపోయి ఉండే ప్రాంతంలో ఒక మిని థియేటర్ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న థియేటర్‌గా రికార్డులకెక్కింది. పిక్చర్ టైమ్ పేరుతో ఒక టెంట్ ఏర్పాటు చేసి.. లోపల సాధారణ ఉష్ణోగ్రతలను ఏర్పాటు చేసి మూవీ స్క్రీన్, ప్రొజెక్టర్, సీటింగ్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ ప్రదర్శితమైన తొలి చిత్రం.. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కింది కావడం విశేషం. ఆ చిత్రమే.. బెల్‌బాటమ్. 80వ దశకంలో భారత్ లక్ష్యంగా జరిగిన ఒక హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. రంజిత్ తివారి దర్శకుడు. రెండు వారాల కిందటే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పుడు లద్దాక్‌లో ఏర్పాటైన మినీ థియేటర్లో ప్రదర్శించారు. ఆ ప్రాంతంలోని కొందరు సాధారణ పౌరులతో కలిసి సైనికులు ఈ సినిమాను వీక్షించారు.
హైజాక్ ఆపరేషన్ నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన సినిమా కావడంతో ‘బెల్ బాటమ్’ను సైనికులు బాగా ఎంజాయ్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కకపోయినా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన థియేటర్లో ప్రదర్శితమైన తొలి చిత్రంగా ఘనత వహించింది.
This post was last modified on August 30, 2021 8:36 am
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే.…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
రాజకీయ పార్టీల భవితవ్యం ఏంటనేది.. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి.. సర్వేలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో నాయకులు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…